Ad Code

వైద్యం వికటించి పసికందు మృతి


హైదరాబాద్‌లోని సన్ సిటీ పరిధిలో రాము అనే ఆరు నెలల శిశువు చికిత్సలో భాగంగా మృతి చెందడం స్థానికంగా కలకలం రేపింది. శిశువుకు జ్వరం రావడంతో తల్లిదండ్రులు సమీపంలోని క్రియాన్స్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు గడువు ముగిసిన మందు ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మందు ఇచ్చిన కొద్దిసేపటికే బాలుడి ఆరోగ్యం విషమించడంతో పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో మృతి చెందినట్లు తెలిపారు. ఈ ఘటనపై బాధిత కుటుంబం ఆవేదన వ్యక్తం చేస్తూ సంబంధిత అధికారులను విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తున్నారు. స్థానికులు కూడా ఘటనపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, ఆస్పత్రి నిర్లక్ష్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. 

Post a Comment

0 Comments

Close Menu