లావా బోల్డ్ ఎన్ 2 స్మార్ట్ ఫోన్ ను ఈరోజు విడుదల చేసింది. ఈ ఫోన్ ను రూ. 7,499 రూపాయల ప్రైస్ ట్యాగ్ తో లాంచ్ చేసింది. ఈ ఫోన్ ఇండస్ బ్లాక్, సియాచిన్ వైట్ రెండు రంగుల్లో లభిస్తుంది. ఫిబ్రవరి 27వ తేదీ మధ్యాహ్నం 12 గంటల నుంచి ఈ ఫోన్ సేల్ స్టార్ట్ అవుతుంది. ఈ ఫోన్ అమెజాన్ మరియు లావా అధికారిక సైట్ నుంచి సేల్ అవుతుంది. దీనిలో 6.75 ఇంచ్ LCD స్క్రీన్ కలిగి ఉంటుంది. ఈ స్క్రీన్ 90Hz రిఫ్రెష్ రేట్ కలిగి ఉంటుంది. ఇందులో ఫేస్ అన్లాక్ మరియు సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ వంటి సెక్యూరిటీ ఫీచర్స్ కూడా ఉన్నాయి. ఈ ఫోన్ Unisoc 9863A వంటి యునిసోక్ బడ్జెట్ చిప్ సెట్ పని చేస్తుంది. ఈ ఫోన్ లో 4జీబీ ఫిజికల్ ర్యామ్, 4 జీబీ వర్చువల్ ర్యామ్ మరియు 64 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ ఉన్నాయి. ఈ స్మార్ట్ ఫోన్ ఆండ్రాయిడ్ 15 గో OS తో లాంచ్ అయ్యింది. ఈ లేటెస్ట్ బడ్జెట్ స్మార్ట్ ఫోన్ లో వెనుక 13MP మెయిన్ సెన్సార్ జతగా మరో కెమెరా కలిగిన డ్యూయల్ రియర్ కెమెరా మరియు 5MP సెల్ఫీ కెమెరా కలిగి ఉంటుంది. ఈ ఫోన్ IP 64 రేటింగ్ డస్ట్ అండ్ స్ప్లాష్ రెసిస్టెంట్ గా ఉంటుంది. లావా బోల్డ్ ఎన్ 2 స్మార్ట్ ఫోన్ 5000 mAh బిగ్ బ్యాటరీ తో లాంచ్ అయ్యింది. ఈ ఫోన్ లో సింగల్ స్పీకర్ మరియు 3.5mm జాక్ కూడా ఉన్నాయి.
0 Comments