ఆంధ్రప్రదేశ్ లోని మదనపల్లి ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. నిందితుడికి అత్యంత కఠిన శిక్ష పడేలా చూస్తామన్నారు. మంగళవారం సాయంత్రం చిన్నారి తల్లిదండ్రులతో చంద్రబాబు, నారా లోకేష్ ఫోన్‌లో మాట్లాడారు. కుటుంబానికి ధైర్యం చెప్పారు. ప్రభుత్వం ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. నిందితుడిని వదిలిపెట్టబోమని చెప్పారు. వివరాలలోకి వెళ్లితే అన్నమయ్య జిల్లా మదనపల్లెలో అదృశ్యమైన ఏడేళ్ల బాలిక మృతదేహాన్ని ఎదురుగా ఉన్న కులవర్ధన్ అనే వ్యక్తి ఇంట్లోనే పోలీసులు గుర్తించారు. అత్యాచారం చేసి, అనంతరం హత్య చేసి డ్రమ్ములో కుక్కినట్లు గుర్తించారు. కులవర్ధన్‌ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. గతంలోనూ స్థానిక మహిళలతో అతడు అసభ్యంగా ప్రవర్తించినట్లు ఆరోపణలు ఉన్నాయి. మదనపల్లె ఒకటో పట్టణ పోలీసులు అక్కడికి చేరుకుని విచారణ చేపట్టారు.
0 Comments