తెలంగాణ రాష్ట్రంలోని మేడారంకు భక్తులు పోటెత్తారు. మౌని అమావాస్య సందర్భంగా భక్తులు తమ మొక్కులను తీర్చుకునేందుకు తండోపతండాలుగా కదిలివచ్చారు. వరుస సెలవులు కావడంతో భారీగా రద్దీ నెలకొంది. దీంతో వనదేవతలు సమ్మక్క, సారలమ్మ గద్దెల ప్రాంగణం కిటకిటలాడుతోంది. భక్తులు మొక్కులు చెల్లించుకుంటున్నారు. మరోవైపు సీఎం రేవంత్‌రెడ్డి అధ్యక్షతన ఆదివారం మేడారంలో మంత్రివర్గ సమావేశం జరగనున్న నేపథ్యంలో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటుచేశారు.
మేడారంకు పోటెత్తిన భక్తులు
January 18, 2026
0
Tags