పెరిగిన కూరగాయల ధరలు !

Telugu Lo Computer
0


దేశవ్యాప్తంగా పంటల దిగుబడి తగ్గిన నేపథ్యంలో డిమాండ్ కు సరిపడా లేక కూరగాయల ధరలు భారీగా పెరిగాయి. సాధారణంగా టమాట కిలో రూ.20 నుంచి రూ.30 మించేది కాదు. బీర, బెండ, కాకర, చిక్కుడు కూరగాయలు అన్నీ ఇప్పుడు గరిష్టంగా రూ.50 కూడా దాటేవి కాదు. కానీ ఈరోజు మార్కెట్లో ధరలు ఒక్కసారిగా మారిపోయాయి. బీర, బెండ, కాకర, చిక్కుడు కిలో దగ్గర దగ్గరా రూ.80 నుండి రూ.100కు చేరుకుంది. సోరకాయ ధర రూ.40, పచ్చిమిర్చి ఏకంగా కిలో రూ.100కు చేరాయి. స్థానిక మార్కెట్లలో ఇవాళ కిలో టమోటా రూ.72 ధర పలికింది. ఉల్లిపాయలు కిలోకు రూ.42. మునగకాయలు కిలోకు రూ.400 ధర చెల్లించాల్సి వస్తోంది. క్యారెట్ కిలో రూ.64 ఉండగా.. ఫ్రెంచ్ బీన్స్ కిలో రూ.135 ఉంది. గుడ్ల రిటైల్ ధరలు ఒక్కొక్కటి రూ.8 ఉండగా, చికెన్ ఇప్పుడు కిలోకు రూ.280 నుంచి -300కి అమ్ముడవుతోంది. క్యాబేజీ, కాలీఫ్లవర్ వంటి కూరగాయల ధరలు బాగా పెరిగాయి. ముల్లంగి, బీన్స్, కాకరకాయ ఇతర కూరగాయలు ధరలు కూడా బాగా పెరిగాయి. 

Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default