Ad Code

ఫిబ్రవరి మధ్యలో వివో వీ70, వివో వీ70 ఎలైట్ విడుదల


దేశీయ మార్కెట్‌లో మరోసారి సంచలనం సృష్టించేందుకు వివో సంస్థ వీ - సిరీస్ స్మార్ట్‌ఫోన్‌లతో సిద్ధమవుతోంది. తాజా లీకుల ప్రకారం, వివో వీ 70 సిరీస్ ఫిబ్రవరి మధ్యలో దేశంలో లాంచ్ అయ్యే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సిరీస్‌లో తొలి దశలో వివో వీ70, వివో వీ70 ఎలైట్ మోడళ్లను కంపెనీ పరిచయం చేయనుందని సమాచారం. వీ70 సిరీస్‌తో వివో తన వీ -లైన్‌ను కేవలం స్టైలిష్ మిడ్‌రేంజ్ ఫోన్లకే పరిమితం చేయకుండా, ప్రీమియం ఫీల్ ఇచ్చే ఫీచర్లతో ముందుకు తీసుకెళ్లాలని చూస్తోంది. స్టాండర్డ్ వివో వీ70 డిజైన్, కెమెరా, పనితీరు మధ్య మంచి బ్యాలెన్స్‌తో యువతను ఆకట్టుకునేలా ఉండనుంది. మరోవైపు వివో వీ70 ఎలైట్ మాత్రం వీ -సిరీస్, ఎక్స్ - సిరీస్ మధ్య ఉన్న గ్యాప్‌ను తగ్గిస్తూ, దాదాపు ఫ్లాగ్‌షిప్ అనుభూతిని అందించేలా డిజైన్ చేయబడినట్టు తెలుస్తోంది. వీ70లో క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్, AMOLED డిస్‌ప్లేతో హై రిఫ్రెష్ రేట్ (120Hz వరకు), ZEISS ట్యూన్ చేసిన కెమెరాలు, ఫోటోగ్రఫీపై ప్రత్యేక ఫోకస్,పెద్ద బ్యాటరీ, ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, గరిష్టంగా 12GB RAM, 256GB స్టోరేజ్ వేరియంట్లు. ఈ మోడల్ స్టైల్, కెమెరా, రోజువారీ పనితీరు కోరుకునే యూజర్లకు టార్గెట్ చేయబడినట్టు కనిపిస్తోంది. వీ70 ఎలైట్ మరింత శక్తివంతమైన ఫీచర్లతో రానుంది. Snapdragon 8s Gen 3 ప్రాసెసర్ - హైఎండ్ మిడ్‌రేంజ్ చిప్‌సెట్, 6.59 అంగుళాల 1.5K OLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్, ట్రిపుల్ కెమెరా సెటప్: 50MP మెయిన్ కెమెరా, 50MP టెలిఫోటో లెన్స్, 8MP అల్ట్రా వైడ్ కెమెరా,భారీ 6,500mAh బ్యాటరీ, 90W ఫాస్ట్ ఛార్జింగ్. కొత్త బ్రౌన్ కలర్ ఆప్షన్ తో  పాటు మరికొన్ని ప్రీమియం కలర్స్ లో ఈ ఫోన్స్ అందుబాటులోకి రానున్నాయి.

Post a Comment

0 Comments

Close Menu