కనిష్ట స్థాయికి చేరిన ఇరాన్ కరెన్సీ : ఒక్క డాలర్‌కు 14 లక్షల రియాల్స్

Telugu Lo Computer
0


రాన్ కరెన్సీ రియాల్ చరిత్రలో ఎన్నడూ లేనంత కనిష్ట స్థాయికి పడిపోవడం, ద్రవ్యోల్బణం ఆకాశాన్ని తాకడం ప్రపంచవ్యాప్తంగా కలకలం రేపుతోంది. 2026 ప్రారంభం నాటికి ఒక అమెరికన్ డాలర్ విలువ 14 లక్షల రియాల్స్‌కు చేరుకుంది. ఈ ఆర్థిక పతనం వెనుక కొన్ని ప్రధాన కారణాలు ఉన్నాయి. ఇజ్రాయెల్‌తో ఇరాన్ చేస్తున్న యుద్ధానికి తోడు.. ఆ దేశంపై అమెరికా విధించిన ఆంక్షలు ఇప్పుడు ఇరాన్‌ను కోలుకోలేని దెబ్బ తీశాయి. 2025 జూన్‌లో ఇరాన్-ఇజ్రాయెల్ మధ్య జరిగిన యుద్ధం వల్ల ఇరాన్ అణు కేంద్రాలపై అమెరికా దాడులు చేసింది. ఇది ఇరాన్ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీసింది. దీనికి తోడు అణు కార్యక్రమం కారణంగా ఐక్యరాజ్యసమితి తిరిగి ఆంక్షలు విధించడంతో ఇరాన్ కరెన్సీ రియాల్ విలువను పాతాళానికి నెట్టింది. ఇరాన్ చమురు ఎగుమతులపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కఠినమైన ఆంక్షలు విధించడం వల్ల ఆ దేశానికి వచ్చే ఆదాయం గణనీయంగా తగ్గిపోయింది. 2025 డిసెంబర్ నాటికి ద్రవ్యోల్బణం 42.2 శాతానికి చేరింది. ముఖ్యంగా ఆహార పదార్థాల ధరలు గతేడాదితో పోలిస్తే 72 శాతం పెరిగాయి. దేశంలోని బ్యాంకులు, ఆర్థిక సంస్థలపై ప్రభుత్వ నియంత్రణ లేకపోవడం, అవినీతి, తప్పుడు ఆర్థిక విధానాలు ప్రజల నమ్మకాన్ని దెబ్బతీశాయి. డిసెంబర్‌లో ఇరాన్ సెంట్రల్ బ్యాంక్ చీఫ్ రాజీనామా చేయడం దీనికి నిదర్శనం.

Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default