ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ 1xBet కేసులో ప్రముఖులు, క్రికెటర్లు, సినీ నటులు, రాజకీయ నాయకుల ఆస్తులను ఈడీ అటాచ్ చేసింది. మొత్తం రూ.7.93 కోట్ల విలువైన ఆస్తులు తాత్కాలికంగా స్వాధీనం చేసుకున్నట్లు అధికారిక సమాచారం. ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ కేసులో మనీ లాండరింగ్ ఆరోపణలపై ఈడీ పెద్ద ఎత్తున చర్యలు చేపట్టింది. యువరాజ్ సింగ్ కు చెందిన రూ.2.5 కోట్లు, రాబిన్ ఉతప్ప కు చెందిన రూ.8.26 లక్షలు, సోను సూద్ కు చెందిన రూ.1 కోటి, నేహా శర్మ కు చెందిన రూ.1.26 కోట్లు, టీఎంసీ ఎంపీ మిమి చక్రబోర్తి కు చెందిన రూ.59 లక్షలు, అంకుష్ హజ్రా కు చెందిన (బెంగాలీ నటుడు) రూ.47 లక్షలు, ఉర్వశి రౌతేలా తల్లికి చెందిన రూ.2.02 కోట్లను ఈడీ అటాచ్ చేసింది. మొత్తం రూ.7.93 కోట్ల విలువైన ఆస్తుల్ని ఈడీ తాత్కాలికంగా స్వాధీనం చేసుకుంది. 1xBet అనే ఆన్‌లైన్ బెట్టింగ్ యాప్ ద్వారా అక్రమ లావాదేవీలు, మనీ లాండరింగ్ జరిగిందని ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసు విలువ రూ.1,000 కోట్లకు పైగా ఉందని ఈడీ అంచనా వేసింది.
బెట్టింగ్ యాప్ కేసు : ప్రముఖుల ఆస్తులను అటాచ్ చేసిన ఈడీ !
December 19, 2025
0
Tags