అనుమానంతో కట్టుకున్న భార్యను కన్న పిల్లల ముందే పెట్రోల్ పోసి దారుణంగా హత్య చేసిన భర్త !

Telugu Lo Computer
0


హైదరాబాద్ లోని నల్లకుంటలో అనుమానంతో కట్టుకున్న భార్యను కన్న పిల్లల ముందే భర్త దారుణంగా హత్య చేశాడు. భార్యపై విచక్షణారహితంగా దాడి చేయడమే కాకుండా ఆమెపై పెట్రోల్ పోసి నిప్పంటించాడు. దీంతో తీవ్రంగా గాయపడిన భార్య అక్కడిక్కడే మృతి చెందింది. ఈ ఘటన స్థానికంగా సంచలనం రేపింది. వివరాల్లోకి వెళితే నల్గొండ జిల్లా హుజురాబాద్‌కు చెందిన దంపతులు వెంకటేష్, త్రివేణి నల్లకుంటలో నివాసం ఉంటున్నారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న వీరికి ఓ కూతురు, కుమారుడు ఉన్నారు. అయితే ప్రేమించి పెళ్లి చేసుకున్న భార్యను వెంకటేష్ తరచూ అనుమానిస్తుండే వాడు. ఈ విషయంపై భార్యను తీవ్రంగా వేధించేవాడు. వారి మధ్య తరచూ గొడవలు జరిగేవి. తాజాగా భర్త వేధింపులు తాళలేక భార్య త్రివేణి పుట్టింటికి వెళ్లింది. దీంతో అక్కడకు వెళ్లిన వెంకటేష్ తాను మారానని, ఇకపై బాగా చూసుకుంటానంటూ నమ్మించి త్రివేణిని హైదరాబాద్‌కు తీసుకొచ్చాడు. అయితే తీసుకొచ్చిన కొద్ధి రోజులకే ఆమెను అతి దారుణంగా చంపేశాడు. ఎప్పటిలాగే అనుమానంతో భార్యతో గొడవకు దిగిన వెంకటేష్ విచక్షణ మరిచి ఆమెపై దాడి చేశాడు. అంతటితో ఆగకుండా త్రివేణిపై పెట్రోల్ పోసి నిప్పటించాడు. అడ్డుకున్న కూతురిని కూడా మంటల్లో తోసేసిన వెంకటేష్ అక్కడి నుంచి పరారయ్యాడు. అరుపులు, కేకలు విన్న స్థానికులు వెంటనే అక్కడకు చేరుకుని మంటలను అదుపు చేసి ఇద్దరినీ కూడా స్థానిక ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే త్రివేణి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కూతురు స్వల్పగాయాలతో బయటపడింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడి కోసం గాలించి  కేవలం 12 గంటల్లోనే వెంకటేష్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default