ఆంధ్రప్రదేశ్ లోని బాపట్ల జిల్లా సంతమాగులూరు మండలం ఏల్చూరుకు చెందిన వెంకటేశ్వర్లు, పల్నాడు జిల్లా మాచవరానికి చెందిన మహాలక్ష్మి ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. అయితే గత కొంతకాలంగా భార్యాభర్తల మధ్య విభేదాలు తలెత్తడంతో, ఇద్దరూ విడివిడిగా ఉంటున్నారు. ఇదే సమయంలో ఆదివారం మాచవరం వెళ్లిన వెంకటేశ్వర్లు బంగారం ఆశ చూపి భార్యను నమ్మించి గ్రామ శివారు ప్రాంతానికి తీసుకెళ్లాడు. ఒక్కసారిగా ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. అనంతరం ఆమె మృతదేహాన్ని బైక్‌పై స్థానిక పోలీసు స్టేషన్‌కు తీసుకెళ్లి, పోలీసుల ముందు లొంగిపోయాడు. పోలీసులు వెంటనే మహాలక్ష్మిని సమీపంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా, పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మరణించినట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.
భార్యను హత్య చేసి శవాన్ని బైక్‌పై లీసు స్టేషన్‌కు తీసుకెళ్లి లొంగిపోయిన భర్త !
December 14, 2025
0
Tags