ఢిల్లీ కాలుష్యంపై చర్చించకుడానే లోక్ సభ నిరవధిక వాయిదా పడింది. నిన్న వీబీ జీ-రామ్-జీ బిల్లుకు పార్లమెంట్ ఆమోదం తెలిపింది. ఇవాళ కూడా విపక్షాల నిరసనలు కొనసాగుతున్నాయి. వీబీ జీ-రామ్-జీ బిల్లును ఆమోదించడాన్ని నిరసిస్తూ పార్లమెంట్ ఆవరణలో మహాత్మా గాంధీ ఫొటోలతో విపక్షాల నిరసనకు దిగాయి. రాత్రంత సంవిధాన్ సదన్ ముందు తృణమూల్ ఎంపీలు నిరసనలు తెలిపారు. తెల్లవారుజాము దాకా అక్కడే ఉండి ఎంపీలు నిరసనలు తెలిపారు. రాజ్యసభ నుంచి విపక్షాలు వాకౌట్ చేశాయి. లోక్‌సభలో గురువారం విపక్షాలు.. సభ మధ్యలోకి దూసుకెళ్లి, బిల్లు ప్రతులను చించివేసి నినాదాలు చేశారు. సాయంత్రం బిల్లుపై చర్చ ప్రారంభించిన రాజ్యసభ.. అర్ధరాత్రి దాటిన తర్వాత తీవ్ర నిరసనల మధ్య మూజువాణి ఓటుతో బిల్లును ఆమోదించింది.
ఢిల్లీ కాలుష్యంపై చర్చించకుడానే లోక్ సభ నిరవధిక వాయిదా
December 19, 2025
0
Tags