రేషన్‌ కార్డులు కొనసాగాలంటే e-KYC తప్పనిసరి !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్‌ లో ఇప్పటికే ఉన్న రేషన్‌ కార్డులు కొనసాగాలంటే తప్పనిసరిగా e-KYC పూర్తి చేయించుకోవాలని, లేకపోతే ఆ కార్డులను రద్దు చేస్తామని అధికారికంగా పౌరసరఫరాల శాఖ ప్రకటించింది. దీంతో ప్రభుత్వ సంక్షేమ పథకాలు, సబ్సిడీ బియ్యం, పిండి, నూనె వంటి వస్తువులను పొందాలంటే ప్రతి సభ్యుడు తన వేలిముద్రను ఈ-పోస్‌ యంత్రంలో నమోదు చేయాలి అని అధికారులు స్పష్టం చేశారు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వంలో ఉన్న లక్షలాదిమంది రేషన్‌ కార్డుల్లో e-KYC ప్రక్రియ ఇంకా పూర్తి కాలేదు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రతి కుటుంబ సభ్యుడు డీలర్ వద్ద e-KYC చేయించుకోవాలని, లేకపోతే ఆ కుటుంబాన్ని అనర్హుల జాబితాలో చేర్చుతామని హెచ్చరించింది. ఇలా జరిగితే రేషన్ కార్డుల ఆధారంగా పొందుతున్న ఇతర ప్రభుత్వ పథకాలపై ఇది ప్రభావం చూపనుంది. అధికారులు వెల్లడించిన ప్రకారం,,e-KYC ప్రక్రియ చాలా సులభం. రేషన్ డీలర్ వద్ద ఉన్న ఈపోస్ యంత్రంలో వేలిముద్ర ఇవ్వడం ద్వారా ప్రక్రియ పూర్తవుతుంది. రేషన్ సదుపాయాలు కొనసాగాలంటే ప్రతి ఒక్కరూ నవంబర్ చివరి నాటికి ఈ ప్రక్రియ పూర్తి చేయాలని సూచించారు.


Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default