చంచల్‌గూడ జైలులో ఖైదీ జాబ్రీపై దస్తగిరి అనే మరో ఖైదీ హత్యా యత్నం

Telugu Lo Computer
0


హైదరాబాద్ లోని చంచల్‌గూడ జైలులో ఖైదీ జాబ్రీపై దస్తగిరి అనే మరో ఖైదీ హత్యా యత్నం చేశాడు. ఖైదీల ఘర్షణలో ములాఖాత్ రూమ్‌లోని అద్దాలు ధ్వంసమయ్యాయి. తీవ్ర గాయపడిన ఖైదీ జాబ్రీని జైలు అధికారులు ఆసుపత్రికి తరలించారు. దస్తగిరి, జాబ్రీల మధ్య ఉన్న పాత కక్షల నేపథ్యంలో జైల్లో దాడి చేసుకున్నట్లు సమాచారం. రౌడీ షీటర్ జాబ్రీ ఓ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు.

Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default