పంజాబ్‌లో గ్రెనేడ్ దాడులకు కుట్ర పన్నిన వారిని అరెస్ట్ చేసినట్లు లూథియానా పోలీసులు వెల్లడించారు. పాక్ నిఘా సంస్థ ఐఎస్ఐ ప్రోద్బలంతో గ్రెనేడ్ దాడికి సిద్ధమవుతున్న మాడ్యుల్‌ను పోలీసులు ఆదిలోనే అడ్డుకున్నారు. 10 మంది నిందితులను అరెస్ట్ చేశారు. మలేషియాలోని ఆపరేటర్ల ద్వారా నిందితులు కుట్ర పన్నినట్టు పోలీసులు తెలిపారు. పాక్‌లోని హ్యాండ్లర్లతో సంప్రదింపులు జరుపుతూ హ్యాండ్ గ్రెనేడ్‌ల సేకరణ, డెలివరీ చేస్తున్నారని చెప్పారు. అధిక జనాభా ఉన్న ప్రాంతంలో గ్రెనేడ్ దాడి చేసి రాష్ట్రంలో అశాంతిని రేకెత్తించేందుకు నిందితులు ప్లాన్ చేసినట్టు పంజాబ్ డీజీపీ తెలిపారు. ఇక ఢిల్లీ పేలుళ్ల నేపథ్యంలో వార్తల్లో నిలిచిన అల్ ఫలాహ్ యూనివర్సిటీకి నేషనల్ ఎసెస్‌మెంట్ అండ్ ఎక్రిడిషన్ కౌన్సిల్ (న్యాక్) షోకాజ్ నోటీసులను జారీ చేసింది. యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో గుర్తింపునకు సంబంధించి తప్పుడు సమాచారం ఉండటంతో నోటీసులు జారీ చేసింది. న్యాక్ గుర్తింపు లేకపోయినా ఉన్నట్టు వెబ్‌సైట్‌లో పేర్కొన్నారని నోటీసుల్లో తెలిపింది. అల్ ఫలాహ్ ఆసుపత్రిలో పని చేస్తున్న డాక్టర్లు కొందరు ఢిల్లీ పేలుళ్లకు కుట్ర పన్నినట్టు వెలుగులోకి రావడంతో దర్యాప్తు సంస్థలు యూనివర్సిటీపై కూడా దృష్టి సారించాయి.
పంజాబ్‌లో గ్రెనేడ్ దాడులకు కుట్ర పన్నిన వారి అరెస్ట్
November 13, 2025
0
Tags