తెలంగాణలోని మల్కాజిగిరి జిల్లా కీసర మండలం చీర్యాల్ శ్రీబాలాజీ ఎన్క్లేవ్ లో ప్రమిదల సదానందం అనే వ్యక్తి ఇటీవల కొత్త ఇంటిని నిర్మించుకున్నాడు. ఆదివారం తన ఇంటి ముందు చిన్న పనులు ఉంటే చేసుకుంటున్నాడు. ఈ క్రమంలో ఇద్దరు హిజ్రాలు వచ్చి కొత్త ఇంట్లోకి వచ్చి లక్ష రూపాయలు తమకు ఇవ్వాలని డిమాండ్ చేశారు. అందుకు యజమాని సదానందం నిరాకరించడంతో తిట్టుకుంటూ వెళ్లిపోయారు. తిరిగి మూడు ఆటోల్లో 15 మంది హిజ్రాలు అక్కడికి వచ్చి ఇంటి గేటును ధ్వంసం చేసేందుకు ప్రయత్నించారు. శబ్ధం విని బయటకు వచ్చిన సదానందం, ఆయన కుటుంబ సభ్యులపై కర్రలు, రాళ్లతో దాడి చేశారు. చుట్టుపక్కల వారు అక్కడికి రావడంతో హిజ్రాలు పారిపోయారు. ఈ ఘటనపై కీసర పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారు.
కొత్త ఇంటిని నిర్మించుకున్న యజమానిని లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేసిన హిజ్రాలు : నిరాకరించడంతో కర్రలు, రాళ్లతో దాడి
November 11, 2025
0
Tags