కడప జిల్లాలో అక్రమ రిజిస్ట్రేషన్లను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని కడప జిల్లాలో అక్రమ రిజిస్ట్రేషన్లను రద్దు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నారు. కడపకు పక్కనే ఉన్న సీకేదిన్నె మండలంలో ప్రభుత్వ భూములను గత ప్రభుత్వ హయాంలో నేతలు కబ్జా చేశారని ఆరోపణలు వచ్చాయి. నిషేధిత జాబితాలో ఉన్న భూములను గత పాలనలో తమ పేర్లపై రిజిస్ట్రేషన్ చేయించుకున్నారనే ఫిర్యాదులు వచ్చాయి. ఈ క్రమంలో ఇటీవల రూ. 20 కోట్ల విలువైన భూముల (చెర్లోపల్లె, కృష్ణాపురం గ్రామాల్లో) రిజిస్ట్రేషన్లను కడప జిల్లా కలెక్టర్ రద్దు చేయించగా, తాజాగా మరో 68 భూములను గుర్తించారు. కమలాపురం, కడపకు చెందిన కొందరు కలిసి సీకేదిన్నె మండలంలోని ప్రభుత్వ భూములను అక్రమంగా తమకు రాయించుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. కడప రూరల్, బద్వేలు, పులివెందులలో అక్రమ భూముల రిజిస్ట్రేషన్ల వ్యవహారం బయటపడింది. సీకే దిన్నె మండలంలోని రామచంద్రాపురం, కొప్పర్తి, కృష్ణాపురం, తాడిగొట్ల, మామిళ్లపల్లె, విశ్వనాథపురం, ఊటుకూరులలో మొత్తం 68 డాక్యుమెంట్ల కింద దాదాపు రూ. 500 కోట్ల విలువైన భూముల్ని తమ పేరుతో రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు అధికారులు గుర్తించారు. మరో 300 డాక్యుమెంట్ల వ్యవహారంపై అధికారులు ఆరా తీస్తున్నారు. ఈ క్రమంలో అక్రమ రిజిస్ట్రేషన్లను రద్దు చేయనున్నారు. ఆయా గ్రామాల్లో భూములకు సంబంధించి పత్రాలను రద్ద చేయనున్నారు. ఈ మేరకు సీకే దిన్నె తహసీల్దార్ కార్యాలయం జాబితా విడుదల చేసింది. ఈ భూములన్నీ పలువు రాజకీయ నేతల పేరిట అక్రమంగా రిజిస్ట్రేషన్ అయినట్లు తేలింది. త్వరలోనే మరిన్ని అక్రమాలు బయటపడతాయంటున్నారు. ఈ అక్రమాలకు పాల్పడిన వారిని గుర్తించే పనిలో ఉన్నారు అధికారులు. ఈ అక్రమ రిజిస్ట్రేషన్లు 2019 నుంచి 2022 మధ్యకాలంలో జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారంలో ఎవరైనా అధికారుల పాత్ర ఉంటే.. వారిపై చర్యలు తీసుకునే అవకాశాలున్నాయి. ప్రస్తుతం అధికారులు ఈ అక్రమ రిజిస్ట్రేషన్లను రద్దు చేశారు. అలాగే ఈ రిజిస్ట్రేషన్లు చేయించుకున్న వ్యక్తులపై క్రిమినల్ కేసులు నమోదు చేసే అవకాశం కూడా ఉందని తెలుస్తోంది.


Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default