కోల్‌కతా వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో భారత్ ఓటమి పాలైంది. తొలి టెస్టు మూడో రోజు ఆటలో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన భారత్ 93 పరుగులకే ఆలౌటై 30 పరుగుల తేడాతో సౌతాఫ్రికా చేతిలో భారత్ ఓడింది. దీంతో డబ్ల్యూటీసీ పాయింట్స్ టేబుల్ లో టీమిండియా నాలుగో స్థానంలో నిలిచింది. ఈ ఏడాది ప్రారంభంలో ఇంగ్లాండ్‌లో జరిగిన రెండు పరాజయాలు, తాజాగా ప్రొటీస్ చేతిలో ఓటమి తర్వాత ప్రస్తుతం కొనసాగుతున్న డబ్ల్యూటీసీ 2025-27 సైకిల్‌లో భారత్ మూడు టెస్టులను కోల్పోయింది. ఇదే సమయంలో దక్షిణాఫ్రికా, ఇప్పటివరకు ఆడిన మూడు మ్యాచ్‌ల్లో రెండింటిలో గెలిచింది. డబ్ల్యూటీసీ 2025-27 ఎడిషన్ ఆడిన మూడు టెస్ట్‌ల్లోనూ గెలిచిన ఆస్ట్రేలియా టాప్ లో ఉంది. ఆ తర్వాత ఇప్పటి వరకు మూడు మ్యాచులకు గాను రెండు మ్యాచులు గెలిచిన సౌతాఫ్రికా 24 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. మూడో స్థానంలో శ్రీలంక ఉంది. ఈ జట్టు రెండు టెస్టు మ్యాచులు ఆడగా, ఒక మ్యాచులో గెలిచి, మరో మ్యాచ్ డ్రా అయింది. ఇక భారత్ , పాకిస్థాన్, ఇంగ్లాండ్ జట్లు వరుసగా నాలుగు, ఐదు, ఆరు స్థానాల్లో ఉన్నాయి.
డబ్ల్యూటీసీ పట్టికలో నాలుగో స్థానానికి పడిపోయిన భారత్
November 16, 2025
0
Tags