పాఠశాలలకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనవరి 10 నుండి జనవరి 18 వరకు రాష్ట్రంలోని ప్రభుత్వ , ప్రైవేట్ పాఠశాలలకు సంక్రాంతి సెలవులను అధికారికంగా ప్రకటించింది. జనవరి 19 నుండి పాఠశాలలు తిరిగి ప్రారంభమవుతాయి. పదో తరగతి, ఇంటర్ వార్షిక పరీక్షల షెడ్యూల్‌ను దృష్టిలో ఉంచుకుని విద్యార్థులకు ఎలాంటి అంతరాయం లేకుండా ఉండేందుకు ఈసారి మొత్తం తొమ్మిది రోజుల పాటు సెలవులను ఖరారు చేసినట్లు అధికారులు తెలిపారు.