మహారాష్ట్రలో మంత్రి ప్రతాప్ సర్‌ నాయక్ పై భూకుంభకోణ ఆరోపణలు

Telugu Lo Computer
0


హారాష్ట్రలో మంత్రి ప్రతాప్ సర్‌ నాయక్ రూ. 200 కోట్ల విలువైన భూమిని రూ. 3 కోట్లకే దక్కించుకున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఉప ముఖ్యమంత్రి అజిత్ పవార్ కుమారుడు పార్థ్ పవార్ భూకుంభకోణం కేసు ఇప్పటికే రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతుండగా, తాజాగా రాష్ట్ర మంత్రిపై వచ్చిన ఆరోపణలు సంచలనంగా మారాయి.ఈ మేరకు కాంగ్రెస్ పార్టీ నాయకుడు విజయ్ వడెట్టివార్ విలేకరులతో మాట్లాడుతూ, ప్రతాప్ సర్‌నాయక్ మీరా భయాందర్‌లో దాదాపు రూ. 200 కోట్ల విలువైన నాలుగు ఎకరాల భూమిని రూ. 3 కోట్లకే కొనుగోలు చేశారని ఆరోపించారు. ఆ స్థలలోనే ఆయన ఓ విద్యా సంస్థను ఏర్పాటు చేసినట్లు తెలిపారు.ఈ ఆరోపణలపై మహారాష్ట్ర రెవెన్యూమంత్రి చంద్రశేఖర్ బవాంకులే స్పందించారు. ఈ విషయం గురించి తాను కూడా విన్నానని, కానీ దీనిపై ఎవరి దగ్గరి నుంచి ఫిర్యాదులు అందలేదని తెలిపారు. ప్రతిపక్షాలు తమకు ఫిర్యాదు చేయడం మానేసి, మీడియా ముందుకు వచ్చి ఆరోపణలు చేసేందుకే సమయం కేటాయిస్తున్నాయని విమర్శించారు. ఈ భూమికి సంబంధించి ఏదైనా ఫిర్యాదు అందితే తప్పకుండా చర్యలు తీసుకుంటామని ఆయన అన్నారు.

Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default