ఛత్తీస్‌గఢ్‌కు చెందిన 31 మంది మావోయిస్టులను విజయవాడలో పోలీసులు అరెస్టు చేశారు. ఈ విషయాన్ని ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ మహేశ్ చంద్ర లడ్డా వెల్లడించారు. కానూరు కొత్త ఆటో నగర్‌లోని ఓ భవనాన్ని మావోయిస్టులు షెల్టర్‌గా మార్చుకున్నారనే సమాచారంతో కేంద్ర బలగాలు మంగళవారం ఉదయం సోదాలు నిర్వహించాయి. ఈ క్రమంలో 31 మంది మావోయిస్టులను పోలీసులు అరెస్టు చేసిట్. అరెస్టయిన వారిలో 12 మంది మహిళలు, నలుగురు కీలక హోదాల్లోని వ్యక్తులుగా సమాచారం. మరో 11 మంది మావోయిస్టు సానుభూతిపరులు, మిలీషియా సభ్యులు ఉన్నట్లు తెలుస్తోంది. స్థానిక పోలీసులు, గ్రేహౌండ్స్ ప్రత్యేక బలగాలు కలిసి ఈ ఆపరేషన్‌ను నిర్వహించాయి.
విజయవాడలో 31 మంది మావోయిస్టులు అరెస్టు
November 18, 2025
0
Tags