అల్ ఫలాహ గ్రూపు చైర్మన్ జావద్ అహ్మద్ సిద్ధిక్ ని 13 రోజుల పాటు కస్టడీలోకి తీసుకున్న ఈడీ

Telugu Lo Computer
0

అల్ ఫలాహ్ ఛారిటబుల్ ట్రస్టు మనీల్యాండరింగ్ కేసులో చైర్మన్ జావద్ అహ్మద్ సిద్ధిక్ ని సిటీ కోర్టు డిసెంబర్ ఒకటో తేదీ వరకు  కస్టడీ విధించింది. అడిషనల్ సెషన్స్ జడ్జీ షీతల్ చౌదరీ ప్రధాన్ బుధవారం రాత్రి ఒంటి గంటకు ఈమేరకు ప్రత్యేక ఆదేశాలు జారీ చేశారు. ఎంపీఎల్ఏ చట్టంలో సెక్షన్ 19 కింద సిద్ధిక్‌ను అరెస్టు చేశారు. అల్ ఫలాహ్ గ్రూపుపై విచారణ చేపట్టిన తర్వాత ఈడీ ఈ చర్యలు తీసుకున్నది. ఢిల్లీ క్రైం బ్రాంచ్ పోలీసులు నమోదు చేసిన ఎఫ్ఐఆర్ ఆధారంగా ఏజెన్సీ చర్యలు మొదలుపెట్టింది. ఫరీదాబాద్‌లోని అల్ ఫలాహ్ కాలేజీ విద్యార్థులను, పేరెంట్స్‌ను తప్పుదోవ పట్టించినట్లు గుర్తించారు. ఎన్ఏఏసీ అక్రిడిటేషన్ ఉన్నట్లు నమ్మించారని ఆరోపించారు. 1956 యూజీసీ చట్టంలోని సెక్షన్ 12(బీ) కింద యూజీసీ అనుమతి ఉన్నట్లు కూడా ఆ యూనివర్సిటీ తప్పుగా చూపించినట్లు ఆరోపణలు ఉన్నాయి.

Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default