ఇజ్రాయెల్‌కు అమెరికా బాలిస్టిక్‌ మిసైల్‌ ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థ ?

Telugu Lo Computer
0


క్టోబర్‌ 1న ఇజ్రాయెల్‌పై ఇరాన్‌ బాలిస్టిక్‌ మిసైల్స్‌తో దాడి చేయడంతో అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. అగ్రరాజ్యం వినియోగించే అత్యాధునిక క్షిపణి రక్షణ వ్యవస్థ థాడ్‌ (టెర్మినల్‌ హైఆల్టిట్యూడ్‌ ఏరియా డిఫెన్స్‌)ను టెల్‌ అవీవ్‌కు పంపించనుంది. ఈ విషయాన్ని ఎన్‌ 12 ఛానల్‌ పేర్కొంది. ఈ వ్యవస్థను ఆపరేట్ చేయడానికి అమెరికా సైనికులే ఇజ్రాయెల్‌కు వెళ్లాల్సి ఉంటుంది. ఇరాన్‌పై ప్రతిదాడి చేస్తామని ఇజ్రాయెల్‌ ప్రతిజ్ఞ చేసిన వేళ.. అక్కడ ఎయిర్‌ డిఫెన్స్‌ వ్యవస్థను బలోపేతం చేయడం కోసం దీనిని పంపుతున్నారు. గత ఏడాది అక్టోబర్‌ 7 నాటి దాడుల తర్వాత కూడా ఈ వ్యవస్థను అక్కడ మోహరించాలని అమెరికా రక్షణ మంత్రి లాయిడ్‌ ఆస్టిన్‌ సూచించారు. పశ్చిమాసియాలో తమ పేట్రియాట్‌ బెటాలియన్ల మోహరింపులను పెంచాలని నిర్ణయించారు. అత్యంత వేగంతో వచ్చే బాలిస్టిక్‌ క్షిపణులను ధ్వంసం చేయడానికి థాడ్‌ను అమెరికా అభివృద్ధి చేసింది. ఇది భూ వాతావరణంలో, అంతరిక్షంలో క్షిపణి వార్‌ హెడ్‌ను ధ్వంసం చేయగలదు. 2019లో ఇరాన్‌ సౌదీ చమురు క్షేత్రాలపై దాడులు చేయడంతో.. నాడు థాడ్‌ వ్యవస్థను మోహరించింది. తాజాగా ఈ వ్యవస్థను మోహరించాలనే నిర్ణయంతో.. 3,000 మంది అమెరికా సైనికుల అవసరం ఉంటుందని సమాచారం. యూఏఈ ఇప్పటికే థాడ్‌ వ్యవస్థను కొనుగోలు చేసి వాడుతోంది.

Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default