హైదరాబాద్ లోని ఆసిఫ్‌నగర్‌లో నాంపల్లి ఎమ్మెల్యే మాజిద్, కాంగ్రెస్ నేత ఫిరోజ్‌ఖాన్ అనుచరుల మధ్య గొడవ జరిగింది. బ్యాంకు కాలనీలో రహదారి పనుల పరిశీలనకు కాంగ్రెస్ నేత ఫిరోజ్‌ఖాన్ వచ్చారు. ఈ క్రమంలో ఫిరోజ్‌ఖాన్‌పై మాజిద్ హుస్సేన్ అనుచరులు దాడికి పాల్పడ్డారు. దీంతో ఇరు నేతల కార్యకర్తలు పరస్పర దాడులు చేసుకున్నారు. అప్రమత్తమైన పోలీసులు ఇరువర్గాలను కార్యకర్తలను అదుపు చేశారు.
హైదరాబాద్‌లోని ఆసిఫ్‌నగర్‌లో ఉద్రిక్తత !
October 07, 2024
0
Tags