గాజాలో నరమేథానికి ఇజ్రాయిల్ భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్ సోమవారం పేర్కొన్నారు. పాలస్తీనా పౌరులు లక్ష్యంగా గాజాస్ట్రిప్‌లో యుద్ధోన్మాదంతో ఇజ్రాయిల్ దాడులను ప్రారంభించి ఈ నెల 7వ తేదీ నాటికి ఏడాది అయిన సంగతి తెలిసిందే. ఏడాదిగా కొనసాగిస్తున్న, ఇప్పటికీ కొనసాగుతున్న ఈ మారణహోమానికి ఇజ్రాయిల్ త్వరలో లేదా భవిష్యత్తులో మూల్యం చెల్లించుకోవాల్సిందేనని మర్చిపోకూడదు అని ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు. ఇజ్రాయిల్ ప్రధాని నెతన్యాహూని హిట్లర్‌తో పోల్చడంతో పాటు ఆయనను 'గాజా కసాయి' అని పేర్కొన్నారు.
ఇజ్రాయిల్ మూల్యం చెల్లించుకోక తప్పదు : టర్కీ అధ్యక్షుడు ఎర్డోగన్
October 07, 2024
0
Tags