ఇజ్రాయిల్‌పై రాకెట్లతో విరుచుకుపడిన హిజ్బుల్లా !

Telugu Lo Computer
0


హిజ్బుల్లా మరోసారి ఇజ్రాయిల్‌పై రాకెట్లతో విరుచుకుపడింది. శనివారం ఉదయం ఇజ్రాయిల్ నగరమైన సఫేద్, దాని పరిసర ప్రాంతాలపై 55 రాకెట్లను ప్రయోగించిందని ఇజ్రాయిల్ డిఫెన్స్ ఫోర్సెస్ (ఐడీఎఫ్) వెల్లడించింది. లెబనాన్ నుంచి రెండు దఫాలుగా దాడి జరిగిందని, మొదటిసారి సుమారు 20 రాకెట్లు, రెండోసారి 35 రాకెట్లు ప్రయోగించబడినట్లు ఇజ్రాయిల్ సైన్యం పేర్కొంది. ఇజ్రాయిల్ మిస్సైల్ డిఫెన్స్ సిస్టమ్ చాలా వరకు రాకెట్లను మధ్యలోనే అడ్డగించి ధ్వంసం చేశాయని, కొన్ని బహిరంగ ప్రదేశాల్లో పడినట్లు ఇజ్రాయిల్ చెప్పింది. ఈ దాడిలో ఎవరికి ఎలాంటి గాయాలు కాలేదని వెల్లడించింది. దక్షిణ లెబనాన్‌లోని హిజ్బుల్లా రాకెట్ లాంచింగ్‌లను టార్గెట్ చేసుకుని దాడులు చేసిన కొద్ది సేపటికే, వారు రాకెట్ దాడికి పాల్పడినట్లు ఐడీఎఫ్ వెల్లడించింది.

Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default