ఎనిమిది మున్సిపల్ కార్పొరేషన్లలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులపై మంత్రి నారాయణ సమీక్ష !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్లతో మంత్రి నారాయణ సమీక్ష నిర్వహించారు. తొలుత ఎనిమిది మున్సిపల్ కార్పొరేషన్లలో చేపట్టాల్సిన అభివృద్ధి పనులు, టిడ్కో ఇళ్లపై చర్చించారు. పార్కులు, డివైడర్లు, రోడ్ల గుంతలు, డ్రెయిన్లలో పూడిక తీతలు ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో ప్రజల ఆరోగ్య భద్రతపై పూర్తిగా దృష్టి సారించాలని సూచించారు. వ్యాధులు ప్రబలకుండా అన్ని చర్యలు చేపట్టాలన్నారు. అన్న క్యాంటీన్ల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని చెప్పారు. టౌన్ ప్లానింగ్‌పై ప్రజల నుంచి ఎలాంటి ఫిర్యాదులు రాకుండా చూడాలని సూచించారు. టిడ్కో ఇళ్లు వేగంగా పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేసేలా చర్యలు చేపట్టాలని మంత్రి నారాయణ ఆదేశించారు. 

Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default