ఇన్స్టాగ్రామ్ వినియోగదారు పేరు @guru__brand0000 అనే ఐడీ ఉన్న జైపూర్ కు చెందిన ఒక యువకుడు అక్కడకు వచ్చిన టూరిస్ట్ మహిళలను కించపరుస్తూ రీల్స్ చేస్తున్నాడు. ఒక రీల్ లో ముగ్గురు విదేశీ యువతులను చూపిస్తూ ఈమె రేటు గంటకు 150, ఈమె రేటు గంటకు 200 అంటూ చెప్పుకొచ్చాడు. ఆ యువతులకు భాష రాకపోవడంతో తమను చూపిస్తూ సెల్ఫీ వీడియోలు తీసుకుంటున్నాడు అనుకుని నవ్వుతూ అతనితో మాట్లాడుతున్నారు. మరొక వీడియోలో నడుస్తున్న విదేశీ జంటను చూపించి అందులోని అమ్మాయిని ఫ్రెండ్స్ ఈమె నా వైఫ్ అంటూ చెబుతూ రీల్స్ చేస్తూ కనిపించాడు. ఇంకో వీడియోలో ఒక విదేశీ యువకుడిని చూపించి.. ఇతను నాబావ.. ఇతనితో మీరు గడపాలనుకుంటున్నారా? అంటూ చెప్పుకొస్తున్నారు. ఇలాంటి వీడియోలను చూసిన కొందరు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్ X లో ఆ యువకుడి ప్రవర్తన పట్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. అతను చేసిన వీడియో రీల్స్ ను పోస్ట్ చేస్తూ.. వెంటనే ఆ యువకుడిని అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ జైపూర్ పోలీసులను ట్యాగ్ చేసి పోస్టులు పెడుతున్నారు. ఇటువంటి వారి వల్ల మనదేశ పరువు పోతోందని.. టూరిస్టులను వేధించడం వలన జైపూర్ టూరిజంపై మచ్చ పడుతుందని పేర్కొంటూ వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
టూరిస్టులను వ్యభిచారులుగా పరిచయం చేస్తూ రీల్స్ ?
June 23, 2024
0
Tags