అతి పెద్ద స్టాక్ మార్కెట్ కుంభకోణంపై జేపీసీ విచారణ జరిపించాలి !

Telugu Lo Computer
0


తిపెద్ద స్టాక్ మార్కెట్ కుంభకోణంలో భాగమైన ఉన్న ప్రధాని నరేంద్ర మోడీ, హోం మంత్రి అమిత్ షాలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీతో (జేపీసీ) విచారణ జరిపించాలని కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ డిమాండ్ చేశారు. మార్కెట్‌లో ఒడిదుడుకులకు, ఇటీవల పోల్స్‌కు సంబంధం ఏంటని ఆయన ప్రశ్నించారు. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టాలంటూ నరేంద్ర మోడీ, అమిత్ షా ఇద్దరూ ఎన్నికల ప్రచార సమయంలో ఇన్వెస్టర్లకు ఎందుకు సలహా ఇచ్చారని ప్రశ్నించారు. మేరకు ఆయన గురువారం మీడియాతో మాట్లాడారు. ఫేక్‌ ఎగ్జిట్‌ పోల్స్‌తో జూన్‌ 3న స్టాక్‌ మార్కెట్లు భారీగా లాభపడ్డాయని, ఎన్నికల ఫలితాల రోజు (జూన్‌ 4న) భారీగా నష్టపోయాయని రాహుల్‌ గాంధీ అన్నారు. దీనివల్ల రిటైల్‌ ఇన్వెస్టర్లు సుమారు రూ.30 లక్షల కోట్లు కోల్పోయారన్నారు. ఇదొక పెద్ద స్టాక్ మార్కెట్ కుంభకోణమని రాహుల్ ఆరోపించారు. మోదీ, అమిత్‌షాతోపాటు దేశంలో ఎగ్జిట్ పోల్స్ నిర్వహించిన వారిపై జాయింట్ పార్లమెంటరీ కమిటీతో (జేపీసీ) విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. ఎన్నికల సమయంలో ఎప్పుడూ లేని విధంగా ప్రధాని మోడీ, అమిత్ షా, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్‌ స్టాక్‌ మార్కెట్ల గురించి మాట్లాడారని గుర్తు చేశారు. స్టాక్ మార్కెట్‌లో పెట్టుబడులు పెట్టాలంటూ నరేంద్ర మోడీ, అమిత్ షా దేశంలోని ఇన్వెస్టర్లకు ఎందుకు సలహా ఇచ్చారని ప్రశ్నించారు. ఎగ్జిట్ పోల్స్ తప్పు అని బీజేపీ నేతలకు ముందే తెలుసని ఆరోపించారు. బీజేపీకి ఎగ్జిట్ పోల్స్ సంబంధం ఏంటని నిలదీశారు.

Post a Comment

0 Comments

Post a Comment (0)
6/related/default