Posts

Showing posts with the label police behaved atrociously towards women leaders

ఇది శాసన సభ కాదు - దుశ్శాసన సభ : మీడియాతో కేటీఆర్‌

Image
ఈ రోజు తెలంగాణ అసెంబ్లీ వాయిదా పడిన అనంతరం తెలంగాణ భవన్‌ లో కేటీఆర్‌ మీడియాతో మాట్లాడారు. ' ఇది శాసన సభ కాదు.. దుశ్శాసన సభ. లోక్‌సభకు రాహుల్‌ గాంధీ టీషర్ట్‌ వేసుకుని వెళ్తున్నారు. మేం టీ షర్ట్‌లు వేసుకుంటే తప్పేంటి, ఏ రూల్‌ ప్రకారం అడ్డుకుంటున్నారు. పార్లమెంటరీ, అన్‌ పార్లమెంటరీ డిసైడ్‌ చేయడానికి డీసీపీ ఎవరు?, మహిళా నేతలపై పోలీసులు దుర్మార్గంగా వ్యవహరించారు. సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిల పట్ల పోలీసులు అమానుషంగా ప్రవర్తించారు. ప్రజల తరఫున గొంతు వినిపించడం మా హక్కు. స్పీకర్‌ వివక్ష చూపడం తగదు. సీఎంను విమర్శిస్తే మైక్‌ ఇవ్వను అని స్పీకర్‌ అనడం ఏంటి?, ప్రజలపై చేసే దౌర్జన్యాలు, దోపిడీ, అరాచకాలపై సభలో నిలదీస్తాం. ఈ రోజు జరిగిన ఘటనకు బాధ్యుడు సీఎం రేవంత్‌. సీఎం రేవంత్‌ బాధ్యత తీసుకుని క్షమాపణ చెప్పాలి. సబితా ఇంద్రారెడ్డి, సునీతా లక్ష్మారెడ్డిలకు సీఎం రేవంత్‌ క్షమాపణలు చెప్పాలి. తెలంగాణ మహిళా లోకానికి ఇవాళ అవమానం జరిగింది' అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 'ఈ రోజు జరిగిన ఘటనపై హైకోర్టుకు వెళ్లాం. ఎన్‌హెచ్‌ఆర్సీ, మహిళా కమిషన్‌కు కూడా వెళ్తాం. బీజేపీ-కాంగ్రెస్‌ జాయింట్‌ వెంచర్‌ ...