అమెరికాలోని ఫ్లోరిడాలో ఉన్న మియామీ అంతర్జాతీయ విమానాశ్రయంలో అమెజాన్ సంస్థకు చెందిన ప్రైమ్ ఎయిర్ కార్గో జెట్ విమానం ల్యాండింగ్ సమయంలో రన్ వే దాటి పక్కనున్న వాహనాలపైకి దూసుకెళ్లడంతో భారీ ప్రమాదం సంభవించింది. బోయింగ్ 767 రకానికి చెందిన 7598 విమానం ప్యూర్టో రికో నుంచి వచ్చి మియామీ విమానాశ్రయంలో ల్యాండ్ అవుతున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. రన్ వేపై వేగాన్ని నియంత్రించలేకపోయిన విమానం అదుపుతప్పి అక్కడ ఉన్న పలు వాహనాలను తీవ్రంగా ఢీకొట్టింది. అప్పుడే పెద్ద ఎత్తున మంటలు చెలరేగాయి. ఈ ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే దుర్మరణం చెందగా, ఓ పైలెట్ మాత్రం వెంటనే విమాన కాక్‌పిట్ నుంచి దూకేసి ప్రాణాలు కాపాడుకున్నాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ వైరల్ అవుతోంది.
అమెజాన్ కార్గో జెట్ విమానంలో మంటలు : ఐదుగురు దుర్మరణం : సోషల్ మీడియాలో వీడియో వైరల్
September 08, 2026
0
Tags