ఏఐ కొన్ని పనులను సులభంగా చేసినప్పటికీ అది మనుషులను పూర్తిగా భర్తీ చేయదు. కాబట్టి ఏఐ అనేది ఉద్యోగుల సామర్థ్యాన్ని పెంచే సాధనంగా మారుతుందని మెటా సీఈఓ మార్క్ జుకర్‌బర్గ్ అభిప్రాయపడ్డారు. భవిష్యత్తులో చిన్న టీమ్‌లతోనే పెద్ద కంపెనీలను నడిపే పరిస్థితి రావచ్చు. కంపెనీల పరిమాణం తగ్గినా కొత్త రకాల వ్యాపారాలు, కొత్త ఉద్యోగాలు ఏర్పడతాయని ఆయన అన్నారు. అయితే అంత్రోఫిక్ సీఈఓ డారియో ఆమోడెయ్ మాత్రం ఏఐ వల్ల ఎంట్రీ లెవల్ వైట్ కాలర్ ఉద్యోగాలు తీవ్రంగా ప్రభావితమయ్యే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. లా, ఫైనాన్స్, కన్సల్టింగ్, అడ్మినిస్ట్రేషన్ వంటి రంగాల్లో పదేపదే చేయాల్సిన పనులను ఏఐ I సులభంగా చేయగలదు. దీంతో కంపెనీలు ఖర్చులు తగ్గించుకోవడానికి.. తక్కువ మంది ఉద్యోగులతోనే ఎక్కువ పని చేయించుకునే అవకాశం ఉందని ఆయన చెబుతున్నారు.
0 Comments