Ad Code

ఫిఫా ప్రపంచ కప్ 2026 : ఫైనల్లో స్పెయిన్

ఫిఫా ప్రపంచ కప్ 2026 ఫైనల్‌కు స్పెయిన్ దూసుకెళ్లింది. మంగళవారం అర్దరాత్రి జరిగిన తొలి సెమీఫైనల్లో అద్వితీయమైన ప్రదర్శనతో స్పెయిన్ 2-0తో ఫ్రాన్స్‌ను మట్టికరపించింది. మికెల్ ఒయర్జ్‌బల్ (22వ నిమిషం), పెడ్రో పొరో (58వ నిమిషం) గోల్స్ నమోదు చేసి స్పెయిన్ విజయంలో కీలక పాత్ర పోషించారు. ఫిఫా ప్రపంచకప్ చరిత్రలోనే స్పెయిన్ ఫైనల్ చేరడం ఇది రెండోసారి మాత్రమే. 2010 ఫైనల్లో సౌతాఫ్రికాను ఓడించి టైటిల్ అందుకున్న స్పెయిన్ ఆ తర్వాత కనసీం సెమీఫైనల్ కూడా చేరలేకపోయింది. 2014లో గ్రూప్ దశలోనే నిష్క్రమించిన ఆ జట్టు 2018, 2022లో నాకౌట్ దాటలేకపోయింది. ఈ సారి మాత్రం అద్వితీయమైన ప్రదర్శనతో ఓటమెరుగని జట్టుగా ఫైనల్‌కు దూసుకొచ్చింది. రెండు విజయాలు, డ్రాతో గ్రూప్‌లో అగ్రస్థానం సాధించిన స్పెయిన్.. నాకౌట్‌లో ఆస్ట్రియా, పోర్చుగల్‌పై గెలుపొందింది. క్వార్టర్స్‌లో బెల్జియంను ఓడించింది. మ్యాచ్ ఆరంభం నుంచే స్పెయిన్ ఆధిపత్యం చెలాయించింది. తమ టికి-టాకా వ్యూహంతో ప్రత్యర్థిని ఉక్కిరి బిక్కిరి చేసింది. 8వ నిమిషంలోనే స్పెయిన్‌కు గోల్ చేసే అవకాశం దక్కింది. కానీ బంతి గోల్‌పోస్ట్ వాల్‌ను తాకి కొద్దిలో మిస్సైంది. 22వ నిమిషంలో టీనేజ్ సెన్సేషన్ మికెల్ ఒయర్జ్‌బల్ పెనాల్టీ ద్వారా గోల్ సాధించి స్పెయిన్‌కు 1-0తో ఆధిక్యాన్ని అందించాడు. స్పెయిన్ దూకుడుతో ఫ్రాన్స్ పూర్తిగా చేతులెత్తేసింది. ముఖ్యంగా ఆ జట్టు స్టార్ ప్లేయర్ కైలియన్ ఎంబాపే గోల్ అవకాశాలను సృష్టించలేకపోయాడు. స్పెయిన్ డిఫెన్స్‌ విభాన్ని ఛేదించలేకపోయాడు.

Post a Comment

0 Comments

Close Menu