ఢిల్లీ విమానాశ్రయం సమీపంలోని ద్వారకా ఎక్స్‌ప్రెస్‌వే సొరంగంలో ఉన్నట్టుండి ఒక కారు మంటల్లో చిక్కుకుంది. అయితే మంటలు అంటున్న నాలుగు నిమిషాల లోపే కారులో మంటలను సొరంగంలోని ఆటోమేటిక్ వ్యవస్థ గుర్తించి యాక్టివేట్ అయి మంటలను అదుపులోకి తెచ్చింది. దీంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. అయితే ఈ ప్రమాదం కారణంగా దాని చుట్టూ వాహనాలు నిలిచిపోవడంతో, ఆ సొరంగ మార్గం మొత్తం దట్టమైన పొగతో నిండిపోయింది. ట్రాఫిక్ నిలిచిపోయింది. సోషల్ మీడియాలో ఈ ప్రమాదానికి సంబంధించిన వీడియో వైరల్‌గామారింది. సొరంగంలోని వీడియో ఇన్సిడెంట్ డిటెక్షన్ సిస్టమ్ మంటలను గుర్తించింది. కేవలం 47 సెకన్లలోనే కంట్రోల్ రూమ్ అగ్నిమాపక బృందాన్ని అప్రమత్తం చేసిందని, ఆ వెంటనే టన్నెల్ ఫైర్ మోడ్ యాక్టివేట్ అయిందని అధికారులు తెలిపారు. అధిక పీడన నీటి తుంపరల వ్యవస్థ ఆటోమేటిక్‌గా ప్రారంభమై మంటలను అదుపులోకి తెచ్చింది. ఓవర్‌హెడ్ స్ప్రింక్లర్లు, హీట్ సెన్సార్లు మరియు డెల్యూజ్ ఫైర్ సప్రెషన్ మెకానిజంతో కూడిన టన్నెల్ సమీకృత అగ్నిమాపక భద్రతా వ్యవస్థ సెకన్లలోనే పనిచేయడం ప్రారంభించింది. ఈ వ్యవస్థ మంటలు సమీపంలోని వాహనాలకు వ్యాపించకుండా నిరోధించింది.సొరంగ ఇంజనీరింగ్ నిపుణులు ఇలాంటి అన్ని కొత్త ప్రాజెక్టులలో స్థిరమైన అగ్నిమాపక వ్యవస్థలు ఏర్పాటు చేయబడతాయని చెప్పారు.
0 Comments