టాటా మోటార్స్ ఈవీలపై భారీ ఆఫర్లు !

టాటా మోటార్స్ జూన్ నెలలో ఎలక్ట్రిక్ వాహనాల విక్రయాలను పెంచేందుకు సంస్థ ప్రత్యేక ప్రయోజనాలను ప్రకటించింది. గ్రీన్ బోనస్‌లు, ఎక్స్ఛేంజ్ బెనిఫిట్లు, స్క్రాపేజ్ ప్రోత్సాహకాలు వంటి అనేక రకాల డిస్కౌంట్లు కస్టమర్లకు లభిస్తున్నాయి. టాటా కంపెనీ తన శ్రేణిలోని ఎలక్ట్రిక్ కార్లపై భారీ తగ్గింపులను అందిస్తోంది. కర్వ్ ఈవీపై అత్యధికంగా రూ.3.35 లక్షల వరకు ప్రయోజనాలు ఉన్నాయి. హారియర్ ఈవీపై రూ.2.75 లక్షల వరకు ఆదా చేసుకోవచ్చు. పంచ్ ఈవీ, టియాగో ఈవీ మోడళ్లపై రూ.1.45 లక్షల వరకు తగ్గింపులు ఉండగా, నెక్సాన్ ఈవీపై రూ.50 వేల వరకు ప్రయోజనాలు అందుబాటులో ఉన్నాయి. ఈ డిస్కౌంట్లు వేరియంట్ మరియు స్టాక్ లభ్యతపై ఆధారపడి ఉంటాయి. ఎక్స్ఛేంజ్ మరియు స్క్రాపేజ్ ప్రయోజనాలను కొన్ని సందర్భాల్లో కలిపి పొందడం కుదరదు. 

Post a Comment

Previous Post Next Post
3