Ad Code

ట్రంప్ ఆరోగ్యంపై కొత్త చర్చకు దారితీసిన వీడియో !


మెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్  ఎయిర్ ఫోర్స్ వన్ మెట్లపై నుండి జాగ్రత్తగా నడుచుకుంటూ వస్తున్న వీడియో ఒకటి ఆయన ఆరోగ్యంపై కొత్త చర్చకు దారితీసింది. ట్రంప్ ఆరోగ్యంగానే ఉన్నాడా..? అసలు ఆయనకు ఏమైంది..? అన్న చర్చలు మళ్లీ ఊపందుకున్నాయి. సోషల్ మీడియాలో  ఆయన కదలికలను నిశితంగా పరిశీలిస్తూ, ఆయన శారీరక పరిస్థితిపై అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. మార్చి 21న ట్రంప్ ఫ్లోరిడాకు వచ్చినప్పుడు చిత్రీకరించిన ఈ ఫుటేజ్ ఆన్‌లైన్‌లో వేగంగా వైరల్ అవుతోంది. దీంతో సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలను రేకెత్తించింది. కొందరు ఆయన నెమ్మది నడకలో అసౌకర్యపు సంకేతాలను చూడగా, మరికొందరు ఈ ప్రచారాన్ని అతిశయోక్తిగా కొట్టిపారేశారు. 'వావ్! ట్రంప్ నిజంగానే ముసలివాడిగా, అలసిపోయినవాడిగా, చిందరవందరగా కనిపిస్తున్నాడు, అతను ఎయిర్ ఫోర్స్ వన్ మెట్లు కూడా దిగలేకపోతున్నాడు!' అని ఒక యూజర్ ఆ వీడియోను షేర్ చేస్తూ రాశారు. అలాంటిదేం లేదు. ఆయన నడక సాధారణమే కావచ్చునని మరికొందరు అభిప్రాయపడ్డారు, అయితే ఆ దృశ్యం ఊహాగానాలకు ఆజ్యం పోసినట్లు అయ్యింది.

Post a Comment

0 Comments

Close Menu