దేశీయ మార్కెట్లో రియల్‌మీ P4 లైట్ విడుదలైంది. ఇందులో 6300mAh భారీ బ్యాటరీని అందించడం విశేషం. ఒక్కసారి ఛార్జింగ్ పెడితే రోజుల తరబడి వాడుకోవచ్చని కంపెనీ చెబుతోంది. ఎంట్రీ-లెవల్ సెగ్మెంట్‌లో ఈ ఫోన్‌ను చాలా రీజనబుల్ ప్రైస్‌తో తీసుకొచ్చారు. 4GB ర్యామ్ + 64GB స్టోరేజ్ బేస్ వేరియంట్ ధర రూ.9,999. కాస్త ఎక్కువ స్టోరేజ్ కావాలనుకునే వారి కోసం 4GB ర్యామ్ + 128GB వేరియంట్‌ను రూ.11,999కి కొనుగోలు చేయవచ్చు. ఫస్ట్ సేల్‌లో భాగంగా కస్టమర్లకు రూ.1,000 కూపన్ డిస్కౌంట్, అలాగే బ్యాంక్ కార్డుల ద్వారా మరో రూ.1,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఫిబ్రవరి 24 నుంచి ఫ్లిప్‌కార్ట్, రియల్‌మీ అఫీషియల్ వెబ్‌సైట్‌తో పాటు ఆఫ్‌లైన్ స్టోర్లలో ఈ ఫోన్ కొనుగోలుకు అందుబాటులో ఉంటుంది. సీ బ్లూ, అబ్సిడియన్ బ్లాక్, బీచ్ గోల్డ్ లాంటి మూడు కలర్లలో దీన్ని సొంతం చేసుకోవచ్చు. రియల్‌మీ P4 లైట్‌లో అందరి దృష్టిని ఆకర్షించే ఫీచర్ దాని 6300mAh బ్యాటరీ. ఈ ధరలో ఇంత పెద్ద బ్యాటరీ రావడం విశేషమనే చెప్పాలి. ఫోన్‌ను హెవీగా వాడినా సరే, ఛార్జర్ అవసరం లేకుండా సులభంగా రెండు రోజుల పాటు ఇది పనిచేస్తుంది. దీనికి 15W వైర్డ్ ఛార్జింగ్ సపోర్ట్ ఇచ్చారు. కంపెనీ చెబుతున్న లెక్కల ప్రకారం ఒక గంటలో 0 నుంచి 58 శాతం ఛార్జింగ్ ఎక్కుతుంది. ఇందులో 6W రివర్స్ ఛార్జింగ్ సపోర్ట్ అందించారు. ఫోన్ మందం కేవలం 7.94mm మాత్రమే ఉండేలా డిజైన్ చేసి బరువును 201 గ్రాములకు పరిమితం చేశారు. ఇందులో 90Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.74-అంగుళాల LCD డిస్‌ప్లేను అందించారు. 563 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్ దీని సొంతం. తడి చేతులతో లేదా గ్లౌజులు వేసుకుని వాడినా టచ్ రెస్పాన్స్ బాగుండేలా 'స్మార్ట్ టచ్' అనే స్పెషల్ ఫీచర్‌ను ఇందులో చేర్చారు.ఇందులో UNISOC T7250 ప్రాసెసర్‌ను వాడారు. దీని AnTuTu బెంచ్‌మార్క్ స్కోర్ దాదాపు 2,80,000 వరకు ఉంటుంది. బడ్జెట్ ఫోన్ అయినా ఇందులో 'GT మోడ్' ఇవ్వడం విశేషం. సాధారణంగా ఇది ప్రీమియం ఫోన్లలోనే ఉంటుంది. దీనివల్ల గేమింగ్ పర్ఫార్మెన్స్ మెరుగుపడుతుంది. మొబైల్ లెజెండ్స్ లాంటి గేమ్స్‌ను 60FPSలో వరుసగా రెండు గంటల పాటు ఎలాంటి ల్యాగ్ లేకుండా ఆడుకోవచ్చని బ్రాండ్ చెబుతోంది.రెగ్యులర్ ఫొటోగ్రఫీ కోసం వెనుక వైపు 13 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందు వైపు 5 మెగాపిక్సెల్ కెమెరాను ఇచ్చారు. వీటిలో l ఫొటోల్లో మనకు అక్కర్లేని వాటిని తీసేసే 'AI ఎరేజర్', మంచి పోర్ట్రెయిట్ షాట్స్ కోసం 'AI క్లియర్ ఫేస్', క్రియేటివ్ ఎడిటింగ్ కోసం 'AI ఇమేజ్ మ్యాటింగ్' లాంటి AI ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ ఫోన్ లేటెస్ట్ ఆండ్రాయిడ్ 15 ఆధారిత రియల్‌మీ UI మీద పనిచేస్తుంది. సర్కిల్ టు సెర్చ్, AI బూస్ట్ లాంటి మోడ్రన్ ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఆడియో విషయానికొస్తే.. సింగిల్ స్పీకర్ ఉన్నా వాల్యూమ్ ఏకంగా 300 శాతం వరకు పెరుగుతుంది. ఫోన్ మాట్లాడుతున్నప్పుడు బ్యాక్‌గ్రౌండ్ నాయిస్‌ను 86 శాతం వరకు తగ్గించేందుకు 'AI కాల్ నాయిస్ రిడక్షన్ 2.0' టెక్నాలజీని వాడారు. రియల్‌మీ P4 లైట్ వెనుకవైపు వేవ్ ప్యాటర్న్ డిజైన్‌తో చాలా స్టైలిష్‌గా కనిపిస్తుంది. నోటిఫికేషన్స్ వచ్చినప్పుడు బ్లింక్ అయ్యేలా వెనుకవైపు ఓ 'సర్క్యులర్ RGB పల్స్ లైట్' ఇచ్చారు. IP54 రేటింగ్ కూడా ఉంది. స్టోరేజ్ సరిపోకపోతే మెమొరీ కార్డు ద్వారా 128GB వరకు పెంచుకునే ఆప్షన్ ఇచ్చారు.
0 Comments