కపుల్ ఫ్రెండ్లీ మూవీ టీమ్ తో ప్రభాస్ ముచ్చటిస్తూ ఈ చూసి ఆ ఫీల్ నుంచి బయటకు రావడానికి చాలా సేపు పట్టిందని అన్నారు. చివరి 20 నిమిషాలు మరో స్థాయిలో ఉందని ప్రశంసలు కురిపించారు. ఫ్యాన్స్ కోసం తాను సంవత్సరానికి మూడు, నాలుగు ల్లో నటిస్తున్నానని, కానీ ఒక్కటే విడుదలవుతుందని అన్నారు. తనకు గీతాంజలి అంటే చాలా ఇష్టమని, తాను డైరెక్టర్ మణిరత్నం అభిమానినని అన్నారు. అందరికీ తన ఫుడ్ గురించి తెలుసుకోవాలని ఉంటుందని అన్నారు. మీకు ఒక ఆసక్తికర విషయం చెబుతాను. అప్పుడప్పుడు నేను వేరే రాష్ట్రాల నుంచి ఫుడ్ ఆర్డర్ పెడతాను. ఆదిపురుష్ షూటింగ్ ముంబైలో జరిగేటప్పుడు చెన్నై నుంచి ఫుడ్ ఆర్డర్ పెట్టాను. టీమ్ అందరూ షాకయ్యారు. ఫ్లైట్ లో ఆర్డర్ తీసుకొచ్చిన వ్యక్తి నా దగ్గరకు వచ్చి మీరు మాములు వాళ్లు కాదండీ అని అన్నారని అంటూ ప్రభాస్ చెప్పారు. అలాగే తనకు విజయవాడ పునుగులు అంటే చాలా ఇష్టమని అన్నారు. చిన్నప్పటి నుంచి ప్రమోద్ తన బెస్ట్ ఫ్రెండ్ అని, విజయవాడలో ప్రమోద్ వాళ్ల ఇంటి దగ్గరే ఒక పునుగుల బండి ఉండేదని, సమ్మర్ లో అతడి ఇంటికి వెళ్లినప్పుడు ప్రమోద్ నాన్నగారు వెస్పా మీద తామిద్దరని ఎక్కించుకుని పునుగులు తీనిపించేవారని, ఆ పునుగుల రుచి అంటే తనకు ఎంతో ఇష్టమని అన్నారు. అలాంటి పునుగులు తన జీవితంలో ఎక్కడ తినలేదని, వాటిని గుర్తుచేసుకుంటే ఇప్పటికీ నోరూరుతుందని అన్నారు.
0 Comments