Ad Code

వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సీఈవో నుంచి తప్పుకున్న బోర్జ్ బ్రెండె


రల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సీఈవో బోర్జ్ బ్రెండె తన పదవి నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. అమెరికా ఫైనాన్సియర్‌, సెక్స్ నేరస్థుడు జెఫ్రీ ఎప్‌స్టీన్‌తో లింకున్న కేసులో దర్యాప్తు చేపట్టిన నేపథ్యంలో ఆయన తన పదవి నుంచి వైదొలుగుతున్నట్లు వెల్లడించారు. ఎప్‌స్టీన్‌తో మూడు సార్లు బిజినెస్ డిన్నర్‌లో బోర్జ్ బ్రెండె పాల్గొన్నట్లు ఫైల్స్ ద్వారా తెలిసింది. మెయిల్‌, టెక్ట్స్ మెసేజ్‌ల ద్వారా ఎప్‌స్టీన్‌తో కమ్యూనికేషన్ నిర్వహించినట్లు బోర్జ్‌పై ఆరోపణలు ఉన్నాయి. సునితమైన పరిశీలిన తర్వాత వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ సీఈవో, ప్రెసిడెంట్ హోదాల నుంచి తప్పుకోవాలని నిర్ణయించానని, సుమారు ఎనిమిదిన్నర ఏళ్ల పాటు సేవలు అందించినట్లు తన ప్రకటనలో బోర్జ్ పేర్కొన్నారు. అయితే తన ప్రకటనలో ఎప్‌స్టీన్‌తో లింకు గురించి ఎటువంటి ప్రస్తావన చేయలేదు. ఎటువంటి అవరోధాలు లేకుండా సంస్థ పనులు కొనసాగాలని భావిస్తున్నట్లు తన లేఖలో చెప్పారు. గతంలో నార్వే ప్రభుత్వంలో ఆయన అనేక సీనియర్ పదవులను నిర్వర్తించారు.

Post a Comment

0 Comments

Close Menu