భారత్ తో సహా 40 దేశాల కోళ్లు, కోడి గుడ్లపై సౌదీ అరేబియా నిషేధం విధించింది. ఇటీవల కాలంలో కోళ్లకు వస్తున్న రోగాల కారణంగా సౌదీ అరేబియా డ్రగ్ అథారిటీ (ఎస్‌ఎఫ్‌డీఏ) నిర్ణయం తీసుకుంది. ప్రపంచ వ్యాప్తంగా నెలకొన్న ఆరోగ్య పరిణామాలతో పాటు అంటు వ్యాధులు కూడా ఎక్కువగా ఉండటంతో సౌదీ అరేబియా ఈ నిర్ణయం తీసుకుంది. 40 దేశాల ఫౌల్ట్రీ, గుడ్లపై ఈ నిషేధం అమల్లో ఉంటుందని ఎస్‌ఎఫ్‌డీఏ పేర్కొంది. 2004 నుంచి పలు దేశాలపై ఈ నిషేధం అమల్లో ఉండగా, అందులో ఇప్పుడు భారత్ కూడా చేరింది. ఈ జాబితాలో భారత్‌తో పాటు అఫ్గనిస్తాన్, అజర్‌బైజాన్, జర్మనీ, ఇండోనేషియా, ఇరాన్, బోస్నియా, హర్జేగోవినా, బల్గేరియా, బంగ్లాదేశ్, తైవాన్, డిజిబౌటి, దక్షిణాఫ్రికా, చైనా, ఇరాక్, ఘనా, పాలస్తీనా, వియత్నాం, కంబోడియా, కజక్‌స్తాన్, కామెరూన్, దక్షిణ కొరియా, లావోస్, లిబియా, మయన్మార్, ద యునైటెడ్ కింగ్‌డమ్, ఈజిప్టు, మెక్సికో, మంగోలియా, నేపాల్, నైగర్, నైజీరియా, హాంకాంగ్, జపాన్, బుర్కినా ఫాసో, సెర్బియా, స్లోవెనియా, ఇవారీ కోస్ట్ తదితర దేశాలున్నాయి.
0 Comments