కంటైనర్ లారీని కారు ఢీకొట్టిన ఘటనలో ఆరుగురు దుర్మరణం


ఆంధ్రప్రదేశ్  లోని చిత్తూరు నగర శివారు బైవీక్లి సర్కిల్ వద్ద వేగంగా వస్తున్న కారు కంటైనర్ లారీని బలంగా ఢీకొట్టి లారీ కిందే ఇరుక్కుపోయింది. దీంతో లోపల ఉన్నవారు తప్పించుకునే అవకాశం లేకుండా పోయి కారులో ఉన్న ఆరుగురు ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, గ్యాస్ కట్టర్లను ఉపయోగించి వాహనాన్ని తెరిచి మృతదేహాలను బయటకు తీశారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం చిత్తూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు మృతుల వివరాలను సేకరించే పనిలో ఉన్నారు. జాతీయ రహదారులపై ప్రయాణించేటప్పుడు భారీ వాహనాల పట్ల అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు.

Post a Comment

Previous Post Next Post
3