సమస్యలు ఉన్నంత వరకు నా స్టేటస్‌లు, ట్వీట్లు ఆగవు : ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు


ఆంధ్రప్రదేశ్ లోని తిరువూరు ఎమ్మెల్యే కొలికపూడి శ్రీనివాసరావు చిట్ చాట్ లో "సమస్యలు ఉన్నంతవరకు నా స్టేటస్‌లు ఆగవు, నా ట్వీట్లు ఆగవు" అని ఆయన తెలిపారు. గ్రామాల్లో ఇప్పటికీ రోడ్లు సరిగా లేవని, కనీస వసతులు కూడా అందుబాటులో లేవని చెప్పారు. ప్రజల తరఫున ప్రభుత్వ దృష్టికి సమస్యలను తీసుకెళ్లడం తన బాధ్యత అని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తొలి ఆరు నెలల పాటు ప్రజలు వైసీపీని విమర్శించారని గుర్తుచేశారు. అయితే రేపు తమపై విమర్శలు రావద్దనే ఆలోచనతోనే సమస్యలను ముందుకు తెస్తున్నానని తెలిపారు. తనకు ఎవరితోనూ వ్యక్తిగత విభేదాలు లేవని, ప్రజా ప్రయోజనాల కోసమే మాట్లాడుతున్నానని స్పష్టం చేశారు. అవినీతిపై ఆయన కఠినంగా స్పందిస్తూ "నేను అవినీతి చేయను, చేయనివ్వను" అన్నారు. పరిపాలనలో పారదర్శకత, బాధ్యతాయుత వ్యవహారం ఉండాలన్నదే తన లక్ష్యమని చెప్పారు. గుడ్ గవర్నెన్స్ ర్యాంకింగ్‌లో తిరువూరు మంచి స్థానం సాధించేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తన వాట్సాప్ స్టేటస్‌లపై ఎవరూ ఏమీ అడగలేదని, తాను కూడా ఎలాంటి వివరణ ఇవ్వలేదని తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కారమే తన ప్రధాన లక్ష్యమని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.

Post a Comment

0 Comments

Bottom Ad [Post Page]

Advertisement

WearYourDictionary

Random Posts

Lorem ipsum dolor sit amet, consectetur adipiscing elit. Sed ultricies, sapien et auctor bibendum, magna urna posuere purus, at vehicula erat est ac sem.

Copyright

Copyright © 2022 BlogName.
Credits: imamuddinwp

#Advertisement Popup


SVG Icons

Social

sr7themes.eu.org

Newest Post

జాగ్వార్ ల్యాండ్ రోవర్‌లో 4 వేల ఉద్యోగులకు ఉద్వాసన ?

టాటా మోటార్స్‌కు చెందిన లగ్జరీ కార్ల బ్రాండ్ 'జాగ్వార్ ల్యాండ్ రోవర్' (జేఎల్ఆర్) అంతర్జాతీయ మార్కెట్లో ఒక కీలక నిర్ణయం తీసుకోబోతున్...

Total Pageviews

#Advertisement


#Advertisement


Translate

Travel the world

Full width home advertisement

Advertisement

Random Post

Follow us

Pages

Author Description

Hey there! We are Colorlib, crafting beautiful free website templates and themes since 2013. Our designers push the boundaries to deliver high quality templates for bloggers, businesses, and creatives worldwide!

Post Page Advertisement [Top]

Advertisement

Climb the mountains