ఉత్తర గోవాలోని అర్పోరాలో ఓ నైట్ క్లబ్‌లో భారీ అగ్నిప్రమాదం జరిగి 25 మంది మరణించారు. మృతుల్లో నైట్ క్లబ్ సిబ్బందితో పాటు కొందరు పర్యటకులు కూడా ఉన్నారని స్థానిక అధికారులు వెల్లడించారు. శనివారం అర్ధరాత్రి క్లబ్ కిచెన్‌లో ఉన్న గ్యాస్ సిలిండర్ పేలడంతో మంటలు వ్యాపించాయని పోలీసులు చెప్తున్నారు. ప్రమాదంపై గోవా సీఎం ప్రమోద్ సావంత్ ఆవేదన వ్యక్తం చేశారు. మంటల్లో చిక్కుకుని ముగ్గురు చనిపోయారని, మిగిలిన వారు ఊపిరాడక మరణించారని ఆయన అన్నారు. గ్రౌండ్‌ఫ్లోర్‌లో ఉన్న కిచెన్ చుట్టూ మంటలు ఎక్కువగా వ్యాపించాయని గోవా డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ అలోక్ కుమార్ చెప్పారు. కిచెన్ చుట్టూ మృతదేహాలను ఎక్కువగా గుర్తించారు. క్లబ్‌లో పనిచేస్తున్నసిబ్బందిగా భావిస్తున్నామని అలోక్ కుమార్ తెలిపారు.
గోవా నైట్ క్లబ్‌లో గ్యాస్ సిలిండర్ పేలి భారీ అగ్ని ప్రమాదం : 25 మంది మృతి
December 07, 2025
0
Tags