Ad Code

రెడ్ రైస్‌ - ఆరోగ్య ప్రయోజనాలు


బ్రౌన్ రైస్ తో పాటుగా రెడ్ రైస్ కూడా వినియోగంలోకి వచ్చింది. ఈ రైస్ కూడా ఆరోగ్య పరంగా అనేక లాభాలను అందిస్తుంది. బ్రౌన్ రైస్‌, రెడ్ రైస్ రెండింటిలోనూ ఫైబర్ ఉంటుంది. కానీ రెడ్ రైస్‌లో ఇది కాస్త ఎక్కువ మోతా దులో ఉంటుంది. అలాగే గ్లైసీమిక్ ఇండెక్స్ విలువ బ్రౌన్ రైస్ కన్నా రెడ్ రైస్‌కే తక్కువగా ఉంటుంది. కనుక షుగర్ ఉన్నవారికి బ్రౌన్ రైస్ కన్నా రెడ్ రైస్ ఎక్కువ మేలు చేస్తుందని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. బ్రౌన్ రైస్‌తో పోలిస్తే రెడ్ రైస్‌లో యాంటీ ఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఈ రెండింటిలోనూ మెగ్నిషియం, ఫాస్ఫరస్ సమానంగానే ఉంటాయి. కానీ ఐరన్‌, జింక్ వంటి పోషకాలు మాత్రం రెడ్ రైస్‌లోనే అధికంగా ఉంటాయి. పోషకాల విషయానికి వస్తే రెడ్ రైస్‌లోనే అధికంగా ఉంటాయి. కాబట్టి బ్రౌన్ రైస్‌ను తింటున్నవారు ఈ రైస్‌ను తింటే ఇంకా ఎక్కువ ఫలితం ఉంటుంది. ఈ రైస్‌ను తింటే శరీరంలోని వాపులు తగ్గిపోతాయి. ముఖ్యంగా రక్త నాళాల వాపులు తగ్గుతాయి. దీని వల్ల గుండె ఆరోగ్యంగా ఉంటుంది. రెడ్ రైస్‌ను తినడం వల్ల అధిక మొత్తంలో ఐరన్‌ను పొందవచ్చు. ఇది రక్తం వృద్ధి చెందేలా చేస్తుంది. రెడ్ రైస్‌ను తింటే మెగ్నిషియం అధికంగా లభిస్తుంది. ఇది రక్త నాళాలను వెడల్పు చేస్తుంది. దీంతో రక్త సరఫరా మెరుగు పడుతుంది. దీని వల్ల బీపీ తగ్గుతుంది. హైబీపీ ఉన్నవారికి ఈ రైస్ ఎంతో మేలు చేస్తుంది. అలాగే గుండె కూడా ఆరోగ్యంగా ఉంటుంది. రెడ్ రైస్‌ను తినడం వల్ల క్యాల్షియం అధికంగా లభిస్తుంది. ఇది ఎముకలను దృఢంగా మార్చి ఆరోగ్యంగా ఉంచుతుంది. ఈ రైస్‌లోని మెగ్నిషియం కండరాల నొప్పులను తగ్గిస్తుంది. దీని వల్ల రాత్రి పూట నిద్రలో కాలి పిక్క లు పట్టుకుపోవడం కూడా తగ్గుతుంది. రెడ్ రైస్‌ను తింటుంటే షుగర్ లెవల్స్‌ను నియంత్రణలో ఉంచుకోవచ్చు. ఈ రైస్‌లో ఉండే ఫైబర్‌, యాంటీ ఆక్సిడెంట్లు షుగర్‌ను తగ్గిస్తాయి. దీని వల్ల డయాబెటిస్ అదుపులో ఉంటుంది. ఇలా రెడ్ రైస్ వల్ల మనకు అనేక లాభాలు ఉంటాయి. కనుక బ్రౌన్ రైస్ తింటున్నవారు ఈ రైస్‌ను కూడా తరచూ ఆహారంలో భాగం చేసుకోండి. దీని వల్ల అనేక లాభాలను పొందవచ్చు. 

Post a Comment

0 Comments

Close Menu