అంతర్జాతీయ స్థాయిలో హైదరాబాద్ భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్‌కు రావాలని ప్రధాని మోడీని తెలంగాణ ముఖ్యమంత్రి ఆహ్వానించారు. పార్లమెంట్లో ప్రధానితో జరిగిన ఈ భేటీలో సీఎంతో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఉన్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం కొన్ని ప్రధాన విజ్ఞప్తులు, డిమాండ్లు ప్రధాని మోడీ ఉంచారు. నీతి అయోగ్ సలహాలు సూచనలతో పాటు అన్ని రంగాల నిపుణుల మేధోమథనంతో రూపొందించిన ఈ విజన్ డాక్యుమెంట్‌ను గ్లోబల్ సమ్మిట్‌లో ఆవిష్కరించనున్నట్లు తెలిపారు. వివిధ రంగాల్లో నిష్ణాతులు, నిపుణులు, నీతి ఆయోగ్ సలహా సూచనలను క్రోడీకరించి మేధోమథనం అనంతరం విజన్ డాక్యుమెంట్‌ను రూపొందించినట్టు చెప్పారు. తెలంగాణ రైజింగ్ లక్ష్యాలకు అనుగుణంగా ఫలితాలు సాధించడంలో అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం తగిన సహాయ సహకారాలు అందించాలని ప్రధానమంత్రిని రాష్ట్ర ప్రతినిధులు కోరారు. హైదరాబాద్ మెట్రో రైలు రెండో దశ విస్తరణకు అవసరమైన అనుమతులు మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. మొత్తం 162.5 కిలోమీటర్ల పొడవునా విస్తరించే ప్రతిపాదనలను ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి సమర్పించిందని.. రూ.43,848 వేల కోట్ల అంచనా వ్యయంతో ఈ ప్రాజెక్టును కేంద్ర - రాష్ట్ర ప్రభుత్వాల జాయింట్ వెంచర్‌గా చేపట్టాలని విన్నవించారు.
తెలంగాణ రైజింగ్ 2047 గ్లోబల్ సమ్మిట్‌కు రావాలని ప్రధాని మోడీని ఆహ్వానించిన సీఎం రేవంత్ రెడ్డి
byTelugu Lo Computer
•
•
2 min read