Ad Code

నటి దేవిక మాజీ భర్త, దర్శకుడు దేవదాస్‌ మృతి


దివంగత నటి దేవిక మాజీ భర్త, దర్శకుడు దేవదాస్‌ (88) కన్నుమూశారు. వృద్దాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన ఆదివారం రాత్రి చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో తుదిశ్వాస విడిచారు. సినీ నిర్మాత ఎస్‌ఎంఎస్‌ సుందరరామన్‌ కుమారుల్లో దేవదాస్‌ ఒకరు. సినిమాలపై ఆసక్తితో దివంగత ప్రఖ్యాత దర్శకుడు భీంసింగ్‌ వద్ద పలు సినిమాలకు అసిస్టెంట్‌ డైరెక్టర్‌గా పని చేశారు. ఆ తర్వాత తమిళంతో పాటు తెలుగు లోనూ పలు చిత్రాలు నేరుగా డైరెక్ట్‌ చేశారు. వేగుళి పెన్‌ మూవీ సమయంలో హీరోయిన్‌ దేవిక ఆయనతో ప్రేమలో పడింది. అయితే దేవికయే తన వెంటపడిందని, పెళ్లి చేసుకోమని కాళ్ల మీద పడి బతిమాలిందని ఓ ఇంటర్వ్యూలో చెప్పారు. మనిద్దరికీ సెట్టవదని దేవదాసు చెప్పినా ఆమె వినిపించుకోలేదట పెళ్లికి ఒప్పుకోకపోతే చచ్చిపోతానని బెదిరించింది. దీంతో ఆమె మాటకు తలొగ్గాల్సి వచ్చింది. అలా ఇద్దరూ తిరుపతిలో పెళ్లి చేసుకున్నారు. వీరికి కనక అనే కూతురు జన్మించింది. కనక తెలుగు చలనచిత్ర పితామహుడు రఘుపతి వెంకయ్యనాయుడుకు ముని మనవరాలవుతుంది. 

Post a Comment

0 Comments

Close Menu