ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు జిల్లా కావలిలోఆర్ఎస్ఆర్ ఇంటర్నేషనల్ స్కూల్ బస్సును నెల్లూరు జిల్లా, కావలి నేషనల్ హైవే ముసునూరు టోల్గేట్ వద్ద లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో స్కూల్ బస్ కు క్లీనర్ అక్కడికక్కడే మృతి చెందాడు. బస్సులో ప్రయాణిస్తున్న పలువురు పిల్లలకు తీవ్ర గాయాలయ్యాయి. ఘటనా స్థలానికి పోలీసులు చేరుకున్నారు. తీవ్ర గాయాలపాలైనవారిని వెంటనే అంబులెన్స్ సహాయముతో కావలి ఏరియా వైద్యశాలకు తరలించారు. పిల్లల తల్లిదండ్రులు వెంటనే ఆసుపత్రికి చేరుకున్నారు. కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణా రెడ్డి హుటాహుటిన వైద్యశాలకు చేరుకుని అక్కడి పిల్లలకు మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లను ఆదేశించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.