ఆ క్షణాలు నాకు చాలా ప్రత్యేకమైనవి అందుకే పిచ్‌పై ఉన్న మట్టిని తిన్నా !


ఐసీసీ టీ20 ప్రపంచకప్‌లో భారత జట్టు అజేయంగా నిలిచి ట్రోఫీని కైవసం చేసుకుంది. ఇప్పటి వరకు ఏ జట్టు కూడా ఇలాంటి విజయాన్ని అందుకోలేదు. దక్షిణాఫ్రికాతో జరిగిన ఫైనల్లో రోహిత్ శర్మ సారథ్యంలోని టీమిండియా చివరి ఓవర్‌లో 7 పరుగుల తేడాతో గెలిచి రెండోసారి టీ20 ప్రపంచకప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ 176 పరుగులు చేసి దక్షిణాఫ్రికాను 169 పరుగులకే పరిమితం చేసింది. ఈ సందర్భంగా రోహిత్ శర్మ మాట్లాడుతూ.. నేను పిచ్ దగ్గరికి వెళ్లినప్పుడు, ఆ పిచ్ మాకు చాలా ఇచ్చింది. మేం ఆ పిచ్‌లో ఆడాం. ఆ మైదానంలో మేం గెలిచాం. నా జీవితంలో ఈ మైదానాన్ని, ఆ పిచ్‌ను ఎప్పటికీ గుర్తుంచుకుంటాను. ఆ పిచ్‌లో కొంత భాగాన్ని నా దగ్గర ఉంచుకోవాలనుకున్నాను. అందుకే ఇలా చేశాను. ఆ క్షణాలు నాకు చాలా ప్రత్యేకమైనవి' అంటూ చెప్పుకొచ్చాడు.

Post a Comment

Previous Post Next Post
3