అంతర్జాతీయ క్రికెట్ మండలి గ్లోబల్ టోర్నీల క్యాలెండర్‌ విడుదల

అంతర్జాతీయ క్రికెట్ మండలి తదుపరి ప్రధాన గ్లోబల్ టోర్నీల క్యాలెండర్‌ను విడుదల చేసింది. రాబోయే 2028 లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్, అలాగే 2029 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌పై పూర్తి స్పష్టత ఇచ్చింది. దాదాపు 124 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లోకి క్రికెట్ మళ్లీ గ్రాండ్‌గా రీఎంట్రీ ఇస్తోంది. లాస్ ఏంజెల్స్ ఒలింపిక్స్ జూలై 2028లో జరగనుండగా, దానికి సంబంధించిన క్వాలిఫైయర్ మ్యాచ్‌లను 2028 జనవరి- ఫిబ్రవరిలోనే పూర్తి చేయాలని ఐసీసీ నిర్ణయించింది. ఈ ఒలింపిక్స్ ప్రధాన టోర్నీలో కేవలం 6 జట్లు మాత్రమే పోటీ పడతాయి. ఆటోమేటిక్ అర్హత సాధించని మెన్ అండ్ ఉమెన్ కేటగిరీల్లో టాప్-7 జట్లతో పాటు కరీబియన్ రీజినల్ విన్నర్‌ కలిసి మొత్తం 8 జట్లు ఈ క్వాలిఫైయర్ టోర్నీలో తలపడనున్నాయి.

* ఉమెన్స్ టీమ్స్ టీ20 వరల్డ్ కప్ సూపర్ పెర్ఫార్మెన్స్ ఆధారంగా భారత్, ఆస్ట్రేలియా, సౌతాఫ్రికా, గ్రేట్ బ్రిటన్ జట్లు ఇప్పటికే డైరెక్ట్ క్వాలిఫై అయ్యాయి.

* మెన్స్ టీమ్స్ 2026 డిసెంబర్ 31వ తేదీ నాటి వరకు ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్ ప్రకారం ఆసియా, ఆఫ్రికా, యూరప్, ఓషియానియా ఖండాల నుంచి టాప్ లో ఉన్న జట్లకు నేరుగా బెర్త్ దక్కుతుంది.

* హోస్ట్ కంట్రీగా అమెరికా మెన్స్ టీమ్ (ర్యాంక్ 13) డైరెక్ట్ క్వాలిఫై అయ్యే అవకాశం కనిపిస్తోంది. కానీ యూఎస్ ఉమెన్స్ టీమ్ (ర్యాంక్ 19) కాస్త వెనుకబడింది. ఒకవేళ యూఎస్ ఉమెన్స్ టీమ్ అర్హత సాధించలేకపోతే, ఆ స్థానాన్ని 2027 ఉమెన్స్ ఛాంపియన్స్ ట్రోఫీ ర్యాంకింగ్స్ ఆధారంగా కేటాయిస్తారు.

 వరల్డ్ టెస్ట్ ఛాంపియన్‌షిప్ (2027-29) గ్రాండ్ ఫైనల్ మ్యాచ్ తేదీలను కూడా ఐసీసీ అనౌన్స్ చేసింది.

* 2029 జూన్ 8 నుంచి జూన్ 12వ తేదీ వరకు WTC ప్రతిష్టాత్మక టెస్ట్ ఫైనల్ జరగనుంది.

* టీ20 వరల్డ్ కప్స్ ను 2028లో జరగబోయే పురుషుల, మహిళల టీ20 వరల్డ్ కప్‌లను కేవలం 11 రోజుల గ్యాప్‌తో బ్యాక్-టు-బ్యాక్ నిర్వహించనున్నారు.

* 2027 నుంచి 2031 వన్డే ప్రపంచకప్ మధ్యలో మొత్తం 12 పురుషుల, 7 మహిళల, 5 అండర్-19 ఐసీసీ ఈవెంట్లు జరగనున్నాయి.

Post a Comment

Previous Post Next Post
3