జోగి మేఘన కారు ప్రమాదం : జోగి రమేష్ హస్తం ఉందంటూ మేఘన తండ్రి ఇబ్రహీంపట్నం పోలీసు స్టేషన్‌లో ఫిర్యాదు

వైసీపీ నేత, మాజీ మంత్రి జోగి రమేష్ కోడలు మేఘన, ఆమె తండ్రి కృష్ణ ఈ నెల 15వ తేదీన విజయవాడ నుంచి కోదాడ వైపు కారులో ప్రయాణిస్తున్నారు. ఆ సమయంలో వెనుక నుంచి వేగంగా వచ్చిన ఒక ప్రైవేటు ట్రావెల్స్ బస్సు వారి కారును ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు కొంత భాగం దెబ్బతిన్నది. దీనిపై బస్సు డ్రైవర్‌పై తగిన చర్యలు తీసుకోవాలని, తమకు ప్రాణహాని ఉన్నందున సమగ్ర విచారణ జరపాలని కోరుతూ మేఘన తండ్రి కృష్ణ ఈ నెల 16న ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదు ఆధారంగా పోలీసులు అప్పుడే కేసు నమోదు చేశారు. గతంలోనే జోగి మేఘన తన మామ జోగి రమేష్, భర్త రాజీవ్ మరియు మరికొంత మంది కుటుంబ సభ్యులపై హత్యాయత్నం మరియు వరకట్న వేధింపుల ఆరోపణలతో ఫిర్యాదు చేయడం తెలిసిందే. వారి వల్ల తనకు ప్రాణహాని ఉందని ఆమె మూడు నెలల కిందట ఇబ్రహీంపట్నం పోలీసులకు ఆశ్రయించగా అప్పట్లోనే కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన కారు ప్రమాద ఘటన ప్రమాదవశాత్తు జరిగింది కాదని, దీని వెనుక మాజీ మంత్రి జోగి రమేష్ హస్తం ఉండొచ్చని మేఘన తండ్రి పోలీసుల ఎదుట అనుమానం వ్యక్తం చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. దీనిపై లోతైన దర్యాప్తు జరపాలని ఆయన కోరారు. అయితే, ఇది కేవలం సాధారణ రోడ్డు ప్రమాదమేనని, ఉద్దేశపూర్వకం కాదని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు.

Post a Comment

Previous Post Next Post
3