ట్రైనింగ్ లో ఉన్నరెండు సైనిక విమానాలు ఢీ : నలుగురు పైలట్లు దుర్మరణం

నార్త్ ఫిలిప్పీన్స్ లోని బెంగ్విట్ ప్రావిన్స్ లో రెండు సైనిక విమానాలు ప్రమాదవశాత్తు ఆకాశంలోనే ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో నలుగురు పైలట్లు మృతి చెందారు. ఈ విషయాన్ని ఫిలిప్పైన్స్ ఎయిర్ ఫోర్స్ ధృవీకరించింది. సైనిక విమానాలు ట్రైనింగ్ లో ఉన్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు స్పష్టం చేసింది. స్థానిక కాలమానం ప్రకారం శుక్రవారం మధ్యాహ్నం సౌత్ మనీలాలోని ఫెర్నాడో ఎయిర్ బేస్ లో ఎస్ఎఫ్-260 సింగిల్ ప్రొపెల్లర్ ప్లేన్ లు ప్రమాదవశాత్తు ఒకదాన్నొకటి ఢీ కొన్నట్లు పేర్కొంది. " రెండు ఎయిర్ క్రాఫ్ట్ లు సేమ్ బేస్ పెరిమీటర్ తో కిందకు పడిపోయాయి. నలుగురు ఎయిర్ ఫోర్స్ పైలట్స్ మృతి చెందారు" అని ఫిలిప్పైన్ ఎయిర్ ఫోర్స్ అధికార ప్రతినిధి కల్నల్ అల్విన్ కాపిన్గి యాన్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ప్రమాదంపై ఫిలిప్పైన్ ఎయిర్ ఫోర్స్ పూర్తి స్థాయిలో దర్యాప్తు ప్రారంభించింది. మరోవైపు ఇటీవలి కాలంలో ఫిలిప్పైన్ మిలిటరీ ఎయిర్ క్రాఫ్ట్ విభాగంలో భారీగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఈ ఏడాది మే లో ఎస్ఎఫ్-260 మిలిటరీ విమానం కుప్పకూలిన ఘటనలో ఇద్దరు మిలిటరీ ఫైలట్లు మృతి చెందారు. ఈ ఘటన నార్త్ ఫిలిప్పీన్స్ లోని బెంగ్విట్ ప్రావిన్స్ లో జరిగింది.

Post a Comment

Previous Post Next Post
3